స్టేడియంలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్

స్టేడియంలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప సినిమా మేనియాయే కనిపిస్తోంది. సెలబ్రిటీలంతా ఇప్పుడు పుష్ప సినిమానే ఫాలో అవుతున్నారు. బన్నీ మూవీ డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక క్రికెటర్లు అయితే... ఈ సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తూ అలరిస్తున్నారు. 'శ్రీవల్లి' సాంగ్‌కు డేవిడ్ వార్న‌ర్, రైనా వంటి వారు డ్యాన్స్ చేసి అల‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ క్రికెటర్.. మ్యాచ్ జరుగుతుండగానే.. స్టేడియంలో శ్రీవల్లి పాటకు డాన్స్ చేశాడు.  బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌లో వికెట్ తీసిన ఆనందంలో వెస్టిండీస్‌ క్రికెట‌ర్ డ్వెయిన్ బ్రావో డ్యాన్స్ చేసి అల‌రించాడు. అది కూడా మైదానంలో మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో  బ్రావో ఈ స్టెప్పులు వేశాడు.  

పుష్ప సినిమా గ‌త‌ నెల 17న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమాకు క్రికెట‌ర్లు మరింత ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. కొంద‌రు పుష్ప రాజ్ డైలాగులు చెబుతుండ‌గా, మ‌రికొంద‌రు శ్రీ‌వ‌ల్లి, దాక్కోదాక్కోమేక వంటి పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ అల‌రించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్‌ ఫాజిల్, సునీల్, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మంచి మ్యూజిక్ అందించారు.