ఈగల్ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

ఈగల్ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

'ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపే వాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు ’’ అంటున్నాడు రవితేజ. ఆయన హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను బుధవారం విడుదల చేశారు.  

పోలీసులు, గ్యాంగ్‌‌‌‌స్టర్లు, నక్సలైట్లకు మోస్ట్ వాంటెడ్ అయిన వ్యక్తిగా రవితేజ రెండు డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో కనిపించాడు. కావ్య థాపర్ తనకు లవర్‌‌‌‌‌‌‌‌గా కనిపించింది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. లవ్, యాక్షన్, డ్రామా, ఎమోషన్ లాంటి అంశాలతో ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ కట్ చేశారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో రవితేజ మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది. కార్తీక్‌‌‌‌ రూపంలో మరో మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చాడు. తనకి మంచి పేరు రావాలి. హీరోయిన్స్ కావ్య, అనుపమ నటన ఆకట్టుకుంటుంది. 

నవదీప్, అవసరాల చక్కగా నటించారు. అజయ్ ఘోష్ గారు అద్భుతంగా నవ్వించారు. నేను తెగ ఎంజాయ్ చేశా. నిర్మాత విశ్వ ప్రసాద్ గారితో మరో సినిమా చేయబోతున్నా. దీనితో కలసి హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. ‘సంక్రాంతికి గొప్ప థియేట్రికల్ ఎక్స్​పీరియన్స్ ఇచ్చే చిత్రం అవుతుంది’ అని చెప్పాడు దర్శకుడు కార్తీక్. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘ధమాకా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాతో సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌కి రెడీ అవుతున్నాం. ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ అన్నీ ఉన్నాయి. జనవరి 13న థియేటర్స్‌‌‌‌లో చూడాలని కోరుకుంటున్నాం’ అన్నారు. హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నటులు నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు పాల్గొన్నారు.