నిర్మలో హరీష్ రావు పర్యటన.. ముందస్తు అరెస్టులు

నిర్మలో  హరీష్ రావు పర్యటన.. ముందస్తు అరెస్టులు

నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఇయ్యాళ మంత్రి హరీష్ రావు పర్యటిన నేపథ్యంలో పోలీసులు అర్థరాత్రి నుండే బీజేపీ నేతలను అరెస్టులు చేపట్టారు. అంతకుముందు మంత్రి పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్, బీఎస్పీ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉట్నూర్ లో తుడుందెబ్బ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బోథ్ నియోజకవర్గానికి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా హరీష్ రావ్ కి ప్రశ్నలు సంధిస్తున్న గ్రామస్తులు.. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బోథ్ లో అడుగుపెట్టాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎస్టీ జాబితాలో 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేశాకే జిల్లాకి రావాలని తుడుందెబ్బ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి హరీష్ రావు ఇయ్యాళ నిర్మల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించి, మెడికల్ కళాశాల పనులను పరిశీలించనున్నారు. దాంతో పాటు బోథ్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.