సీఎం కేసీఆర్ చేతుల్లోకి ఈటల ఆరోగ్యశాఖ

సీఎం కేసీఆర్ చేతుల్లోకి ఈటల ఆరోగ్యశాఖ
  • సీఎం చేతుల్లోకి ఆరోగ్య శాఖ
  • ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆయన పదవి నుంచి తప్పించారు. ఆయన నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదలాయిస్తున్నట్లు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సిఫారసులను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. సీఎం సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గవర్నర్ ఉత్తర్వులతో ఆరోగ్య శాఖ సీఎం చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈటల.. ఏ శాఖ లేని మంత్రిగా ఉన్నారు.