గుడ్డు, పన్నీర్​ కలిపి తినొచ్చా.?

గుడ్డు, పన్నీర్​ కలిపి తినొచ్చా.?

గుడ్డు, పన్నీర్​  రెండింట్లోనూ  ప్రొటీన్​ పుష్కలంగా ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి  మేలు చేసేవే. మరి ఈ హెల్దీ ప్రొటీన్స్​ని ఒకేసారి  తినొచ్చా? వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అసలు బరువు తగ్గాలనుకునేవాళ్లు  ఈ కాంబినేషన్​ని డైట్​లో చేర్చొచ్చా?  ఈ ప్రశ్నలకి సమాధానంగా ముంబైలోని  వోక్​హార్డ్​ హాస్పిటల్ హెడ్​  డైటీషియన్​ అండ్​ న్యూట్రిషనిస్ట్​ అమీర్​ షేక్​ ఏం చెప్పారంటే..

బరువు తగ్గాలంటే కేలరీలు తక్కువ, ప్రొటీన్​ ఎక్కువ ఉన్న ఫుడ్​ని డైట్​లో చేర్చాలి. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు గుడ్లు, పన్నీర్​ ఎక్కువగా తింటుంటారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్​ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. ఇవి తినడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్లు రిలీజ్​ అయ్యి చాలాసేపటి వరకు ఏం తినాలనిపించదు కూడా. దాంతో సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే  కొందరు పన్నీర్​, గుడ్లు ఒకే మీల్​లో తింటుంటారు? మరి ఈ కాంబినేషన్​ వెయిట్​ లాస్​కి ప్లస్సా? మైనస్సా? అంటే  ప్లస్​ అనే అంటున్నారు ఈ న్యూట్రిషనిస్ట్​. 

గుడ్లు తింటే..

  •  ఒక కోడిగుడ్డులో 4.8 గ్రాములు ఫ్యాట్​, విటమిన్​–ఎ, క్యాల్షియం, జి విటమిన్​ – డి, రిబో ఫ్లెవిన్​, విటమిన్– బి12, ఫొలేట్, ​  విటమిన్​– ఈ, నియాసిన్, ఐరన్​ ఉంటుంది. వీటన్నింటి వల్ల తేలిగ్గా బరువు తగ్గొచ్చు. ​
  •   గుడ్లలోని సాలిటిటి ఇండెక్స్ (కడుపునిండినట్టు అనిపించడం)​ వల్ల త్వరగా ఆకలి అవ్వదు. 
  •   గుడ్లు తినడం వల్ల  మెటబాలిజం రేటు పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.
  •   కోడి గుడ్డులో శరీరానికి కావాల్సిన ఎసెన్షియల్​  అమీనో యాసిడ్స్​ అన్నీ ఉంటాయి. ఇవి శరీర బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. 

పన్నీర్​ తింటే..

  • 100 గ్రాముల పన్నీర్​లో  1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 72 కేలరీలు ఉంటాయి. అందుకే  బరువు తగ్గాలనుకునేవాళ్లకి  దీన్ని మించిన బెస్ట్​ ఆప్షన్​ మరొకటి లేదు. పన్నీర్​లోని గుడ్​ ఫ్యాట్స్​ కూడా బరువు తగ్గడంలో కీ రోల్​ పోషిస్తాయి. అదెలాగంటే.. గుడ్​ ఫ్యాట్​ ఎక్కువగా ఉంటే శరీరం ఎనర్జీ కోసం దాన్ని  ఖర్చుచేస్తుంది. ఫలితంగా  బరువు తగ్గొచ్చు. 
  •  పన్నీర్​లో కాంజుగేటెడ్​ లినోలిక్​ యాసిడ్​ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్​ లాస్​కి, బాడీ బిల్డింగ్​కి బెస్ట్​ సప్లిమెంట్​​.
  •  వంద గ్రాముల పన్నీర్​లో 83 గ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది, బాడీలో పేరుకున్న ఫ్యాట్​ని కరిగించడానికి సాయం చేస్తుంది. అదెలాగంటే..క్యాల్షియం బాడీ కోర్​ టెంపరేచర్​  థర్మోజెనెసిస్​  పెంచుతుంది. దానివల్ల మెటబాలిజం బూస్ట్ అయ్యి బరువు తగ్గొచ్చు.

లాభమే ఎక్కువ

పన్నీర్​,  కోడి గుడ్లని కలిపి తింటే లాభమే తప్ప నష్టం ఉండదు. ఈ రెండింట్లో ప్రొటీన్​, క్యాల్షియం, విటమిన్​– బి 12, ఐరన్​ పుష్కలంగా ఉంటాయి. దాంతో బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ రెండింటినీ  కలిపి తినడం వల్ల పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అలాగే ఇవి రెండూ పైన చెప్పినట్టుగా డైజెషన్​ ట్రాక్​ని స్లో చేసి బరువు తగ్గడానికి సాయపడతాయి. అయితే డైట్​లో ఉన్నవాళ్లు  పన్నీర్​ టిక్కా, స్క్రాంబుల్డ్​ పన్నీర్,  పన్నీర్ 65 లాంటివి మాత్రమే తినాలి. పన్నీర్​ బటర్​ మసాలా లాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలి. కోడిగుడ్లని కూడా వీలైనంతవరకు ఉడకబెట్టుకుని మాత్రమే తినాలి అంటున్నారు అమీ​ర్​ షేక్. దీంతో పాటు బరువు తగ్గాలను కునే వాళ్లు గుడ్డు, పన్నీర్​ని విడి విడిగా తినడం వల్ల కలిగే లాభాల్ని కూడా చెప్పారు.