ఈడీసీఐఎల్లో ఇంజినీర్ ఉద్యోగాలు ..అర్హతలు పూర్తి డీటేయిల్స్ ఇవే..

ఈడీసీఐఎల్లో ఇంజినీర్ ఉద్యోగాలు ..అర్హతలు పూర్తి డీటేయిల్స్ ఇవే..

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా (ఈడీసీఐఎల్) జూనియర్ ఇంజినీర్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
మొత్తం ఖాళీలు: 13. 
విభాగాల వారీగా ఖాళీలు: ఆర్కిటెక్ట్ 1, సీనియర్ ఇంజినీర్(సివిల్) 3, ఇంజినీర్ (సివిల్) 2, జూనియర్ ఇంజినీర్ (సివిల్) 4, ఆటోకాడ్/ 
రెవిట్ ఆపరేటర్ (3డీ డిజైనింగ్ నైపుణ్యాలతో కూడినవారు) 6, యంగ్ ప్రొఫెషనల్ (డేటా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ & వెబ్ మానిటరింగ్) 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బి.టెక్/ బీఎస్సీ, బి.ఆర్కిటెక్చర్ పూర్తిచేసి ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 2.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15. 
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల విద్యార్హతలు, ప్రొఫెషనల్ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు చేసిన వారి సంఖ్యను బట్టి ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ edcilindia.co.in/TCareersను సందర్శించండి.