చీరకట్టులో ఈషారెబ్బా..తెలుగు అందం ఇదబ్బా

చీరకట్టులో ఈషారెబ్బా..తెలుగు అందం ఇదబ్బా

ఈషారెబ్బ(Eesha Rebba)..తెలంగాణ నటి..టాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వరంగల్ కు చెందిన ఈషా రెబ్బా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. అయినా ఇప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో ఫోటోషూట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.

లేటెస్ట్ గా ఈషా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. చీరకట్టులో మంచి హైటూ, ఆకర్షణీయమైన రూపంతో మెస్మరైజ్ చేస్తూంది. హాట్‌ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.కావాల్సినంత అందం ఉన్న ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. 

ప్రస్తుతం ఈషా ఒకవైపు సినిమాలు చేస్తూనే..మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eesha Rebba (@yourseesha)