డేంజర్ బెల్స్: తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ ఉష్ణోగ్రతలు.. భారత్పై తీవ్ర ప్రభావం..!

డేంజర్ బెల్స్: తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్  ఉష్ణోగ్రతలు.. భారత్పై తీవ్ర ప్రభావం..!

ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా పసిఫిక్ మహాసముద్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరువు కోరలు  విలయ తాండవం చేస్తున్నాయనేందుకు ఈ టెంపరేచర్సే సంకేతం అంటున్నారు నిపుణులు.  ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు పేర్కొంటున్నారు.

2026 అక్టోబర్ 22న పసిఫిక్ సముద్రంలో 30 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నట్లు అమెరికా సముద్ర ఉపరితల వాతావరణ కేంద్రం పేర్కొంది (NOAA). అక్టోబర్ 22న రీడింగ్ 30 డిగ్రీలకు చేరుకుందని.. ఈ శతాబ్దంలో ఇలాంటి రికార్డు నమోదు కాలేదని పేర్కొంది.  ఈ ప్రభావం వచ్చే ఏడాది కూడా ఉండనుందని తెలిపింది.

అక్టోబర్ నుంచి  డిసెంబర్ మధ్యలో మధ్య పసిఫిక్, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రపంచ వాతావరణ కేంద్రం (WMO) పేర్కొంది. ఇది డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనున్నట్లు తెలిపింది. 

పసిఫిక్ ఉష్ణోగ్రతలపై ఆందోళన ఎందుకు..?

ఎల్ నినో అనేది సాధారణ వాతావరణ మార్పు. మధ్య, తూర్పు పసిఫిక్ సముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. ఈ వేడితో గాలులు, మేఘాల కదలికలపై ప్రభావం చూపుతాయి. వాతావరణ మార్పులకు కారణమవుతాయి. ప్రస్తుతం ఈ ప్రభావం చాలా బలంగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. 

WMO ప్రకారం, నినో 3.4 అని పిలిచే ప్రాంతంలో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసం జూన్‌లో సాధారణం కంటే 1.6°C నుండి ఆగస్టులో 2.5°Cకి పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య ఇది ​​సాధారణం కంటే సుమారు 3.7°Cకి చేరుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి, ఇది నవంబర్ 2015-జనవరి 2016 మధ్య నమోదైన 2.6°C మునుపటి రికార్డును అధిగమిస్తుంది. ఈ గణాంకాలు సముద్రం  వాస్తవ ఉష్ణోగ్రతను కాకుండా, దాని  సగటు కంటే ఎంత వేడిగా ఉందో కొలిచేందుకు ఉపయోగపడతాయి. 

భారత్ పై ప్రభావం ఎంత..?

భారత్ పై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వర్షపాతం, ఉష్ణాగ్రతల మార్పు వలన తీవ్ర కరువు పరిస్తితులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 2026లో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 

రానున్న నెలల్లో ఉష్ణాగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని ముఖ్యంగా దక్షణ ఆసియా దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

ప్రాంతాలను బట్టీ వర్షపాతం మారుతుందని పేర్కొన్నారు. మధ్య, దక్షిణ ఆసియాల్లో అక్టోబర్-డిసెంబర్ లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు పేర్కొంది. 

అయితే భారత్ లో వాతావరణ మార్పులకు  పూర్తిగా ఎల్ నినో ఒక్కటే కారణం కాబోదని చెబుతున్నారు. ఇతర వాతావరణ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేయనున్నట్లు చెబుతున్నారు. వీటికి తోడు  పసిఫిక్ లో ఉష్ణోగ్రత భారత వాతావరణాన్ని, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.