ఎలిమినేషన్ భయంలో రతికా.. ఎంత ఓవర్ యాక్షన్ చేసినా వర్కౌట్ అవలేదు

ఎలిమినేషన్ భయంలో రతికా.. ఎంత ఓవర్ యాక్షన్ చేసినా వర్కౌట్ అవలేదు

బిగ్‌బాస్ 7(Bigg boss7)లో సోమవారం కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాటర్ డే, సండే కు మించి నామినేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కంటెస్టెంట్స్ కూడా హీట్ ఆర్గ్యుమెంట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈవారం కూడా అదే సీన్ రిపీట్ అయ్యిందనే చెప్పాలి. ఈసారి రతికా కాస్త.. కాదు కాదు.. చాలా ఓవరాక్షన్ చేసింది. అది ఆడియన్స్ చిరాకు తెప్పించింది. అది కూడా తనకు తానుగా చేసింది కాదు.. ఎదో శివాజీ చెప్పాడని అర్థంలేని వాదన పెట్టుకుంది. కానీ అది పెద్దగా వర్కౌట్ అవలేదు. 

నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ ముందు రతికాను పిలిచాడు కానీ.. ఆలోచించుకోవడానికి టైం కావాలని చాలా ల్యాగ్ చేసింది రతికా. ఆతరువాత నామినేషన్ ను ప్రారంభించిన రతికా.. ముందు శోభాను నామినేట్ చేసింది.. గతవారం కెప్టెన్‌గా ఎఫర్ట్ ఏం కనిపించలేదనే కారణం చెప్పింది. దానికి శోభా.. మరి నాగ్ సర్ అడిగినప్పుడు బాగానే చేశానని ఎందుకు చెప్పావ్, యావర్ లా నువ్వు కేసుల బాగా చేయలేదని చెప్పాల్సింది అని సమాధానం ఇచ్చింది. దానికి నోరుమూసుకున్న రతికా.. టాపిక్ డైవర్ట్ చేసింది.  దీన్ని బట్టి చూస్తే రతికకి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందుకే హైప్ తెచ్చుకోవాలని ఇలా ఓవరాక్షన్ చేసిందని క్లియర్ గా అర్థమైపోయింది ఆడియన్స్ కి. 

ఇక రెండో నామినేషన్ గా ప్రియాంక పేరు చెప్తూ.. గతవారం నామినేషన్స్ లో డామినేటింగ్ గా ఉన్నారని, తన మాట ఆసలు పట్టించుకోలేదని చెప్పింది. దానికి ప్రియాంక సమాదానం ఇస్తూ.. నీకు ఇప్పుడు కూడా పాయింట్ లేవు. వేరే వాళ్లు ఎదో చెబితే దాన్ని నువ్వు సాగదీస్తున్నావు అంతే తప్పా.. నీకు పాయింట్స్ లేవు.. రావు కూడా.. నాగ్ సర్ చెప్పేంత వరకు, మీ అమ్మ వచ్చి చెప్పేంత వరకు నీకు తెలియలేదు.. అని రతికా గాలి మొత్తం తీసిపడేసింది ప్రియాంక.

Also Read :- నేను చిరంజీవితో సినిమా చేయలేను.. యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్