డెవిల్‌‌ నా కెరీర్‌‌‌‌లో ప్రత్యేకం : ఎల్నాజ్ నొరౌజీ

డెవిల్‌‌ నా కెరీర్‌‌‌‌లో ప్రత్యేకం : ఎల్నాజ్ నొరౌజీ

‘సేక్రేడ్ గేమ్స్’ లాంటి పాపులర్‌‌‌‌ హిందీ వెబ్‌‌ సిరీస్‌‌తో మెప్పించిన ఎల్నాజ్ నొరౌజీ.. శుక్రవారం విడుదలైన కళ్యాణ్ రామ్ సినిమా ‘డెవిల్‌‌’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రోజీ అనే కీలకపాత్ర పోషించడంతో పాటు స్పెషల్‌‌ సాంగ్‌‌ కూడా చేసింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ‘నేను పుట్టింది ఇరాన్‌‌లో, పెరిగింది జపాన్‌‌లో అయినప్పటికీ గత ఎనిమిదేళ్లుగా ఇండియాలో ఉంటున్నా. ఐదేళ్లుగా ఇక్కడి సినిమాల్లో నటిస్తున్నా ‘డెవిల్‌‌’తో టాలీవుడ్‌‌కు రావడం హ్యాపీ. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఇందులో సాంగ్ చేయడానికి చాలా హోమ్ వర్క్ చేశా. పీరియాడికల్ సినిమాలో క్యారెక్టర్ అంటే.. ఆ పాత్రని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ధరించాలి. పైగా ఇందులో నా లుక్ చాలా స్పెషల్. హెయిర్, రెడ్ లిప్స్ జాజ్ టైప్ మ్యూజిక్.. గతంలో ఇలా ఎప్పుడు కనిపించలేదు. అందుకే నాకు ఈ సినిమా ప్రత్యేకం. కళ్యాణ్ రామ్ సెట్‌‌లో చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా, డైలాగ్స్ విషయంలో ఎన్నో టిప్స్ చెప్పారు. తెలుగు సినిమాలో నటించడం గర్వంగా ఉంది. 

ఇక నాకు నచ్చింది చేయడం చాలా ఇష్టం.  నేను సినిమాలతో పాటు, వెబ్ షోలు చేస్తాను, అలాగే పాడతాను కూడా. త్వరలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించిన ‘సంగీన్’ అనే థ్రిల్లర్ రాబోతోంది. ‘రాణీతి’ అనే చిత్రం జియో సినిమాలో విడుదల కానుంది. నేను చేస్తున్న ‘వోహ్’ అనే పాట కూడా అందులోనే స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుంది’ అని చెప్పింది.