- ఎల్‍నినో నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు ఆరాటం
- హనుమకొండ జిల్లా హసన్‍పర్తి మండలం అనంతసాగర్‍లో ఘటన
వరంగల్, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్‍పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు నల్లాల శ్యాంసుందర్‍రెడ్డి ఎల్‍నినో ప్రభావంతో చేతికొచ్చిన 8 ఎకరాల వరి పంట ఎండిపోకుండా ఉండేందుకు అసాధారణ సాహసం చేశారు.
పంట చివరి దశకు చేరిన తరుణంలో తగినంత నీరు అందక, విద్యుత్ సరఫరా సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన కండ్లముందే పంట ఎండిపోతుంటే చూడలేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు.
ఆర్థిక భారం అవుతున్నప్పటికీ లెక్కచేయకుండా, ఏకంగా నాలుగు ట్యాంకర్లతో నీటిని తెప్పించి తన ఎనిమిది ఎకరాల పొలానికి పారించి పంటను కాపాడుకుంటున్నాడు. రైతు పడుతున్న ఈ ఆరాటాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతగానో ప్రశంసించగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేయడం విశేషం.
