ఎలన్ మస్క్ ఏదీ వదలట్లేదుగా.. చాట్జీపీటీకి పోటీగా కొత్త ఏఐ

ఎలన్ మస్క్ ఏదీ వదలట్లేదుగా.. చాట్జీపీటీకి పోటీగా కొత్త ఏఐ

ఎలన్ మస్క్.. తను తీసుకుంటున్న నిర్ణయాలతో ఉద్యోగులకు, షేర్ హోల్డర్లకు హడలెత్తిస్తున్నాడు. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసేందుకు అడుగులు వేస్తున్నాడు. ఆటో మొబైల్, రాకెట్ సైన్స్, టెక్నాలజీ, సోషల్ మీడియా లాంటి రంగాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నాడు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఏఐ టెక్నాలజీ.. చాట్ జీపీటీ లాంటి సొంత ఏఐని లాంచ్ చేయడానికి మస్క్ ప్లాన్ చేస్తున్నాడు.

చాట్ జీపీటీకి పోటీగా తన సొంత ఏఐకి ‘ట్రూత్ జీపీటీ’ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ ఏఐ ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుందని మస్క్ తెలిపాడు. ట్రూత్ జీపీటీ వల్ల మానవాళికి ఎలాంటి ముప్పు ఉండదని మస్క్ సూచిస్తున్నాడు.