బీటెక్ బ్రోస్ గెట్ రెడీ ..ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా.. ఏం చేస్తున్నావ్? ట్రైలర్ రిలీజ్

బీటెక్ బ్రోస్ గెట్ రెడీ ..ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా.. ఏం చేస్తున్నావ్? ట్రైలర్ రిలీజ్

డెబ్యూ డైరెక్టర్ భరత్‌ మిత్ర( Bharath Mithra) తెరకెక్కిస్తున్న మూవీ ఏం చేస్తున్నావ్‌(Em Chesthunnav?). విజయ్‌ రాజ్‌ కుమార్‌(Vijay Rajkumar) హీరోగా, నేహా పటాన్ (Neha Pathani),అమిత రంగనాథ్(Amitha Ranganath) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ పోస్టర్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతూ..ఖాళీగా ఉన్న కుర్రాడు తెల్లరాగానే కూరగాయాలు కొంటూ నడిచొస్తున్న హీరో రాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంటోంది.ఇక క్లాస్ రూమ్ లో చిన్నపుడు లవ్ స్టోరీ చూపించిన విధానంతో పాటు..ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయంటూ హీరో క్యారెక్టరైషన్ చూపించారు. 

తెలియ లేదుగా..నిను చూసాక నాకేమైందో మంచి ఫీల్ గుడ్ మెలోడీతో.. ఏదైనా మంచి సినిమా చూసినపుడు..గుండె బరువెక్కి..పక్షిలెక్క ఎగురుతున్నట్టు ఉందిరా అమ్మాయిని చూస్తే..అంటూ హీరో చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే అట్ట్రాక్టీవ్ గా ఉంది.  ఇక ఏం చేస్తున్నావ్ టైటిల్ ఎంతో ఆసక్తిగా కనిపిస్తోంది. 

ట్రైలర్ చివరిలో చెప్పినట్టు..బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి ఎదుర్కొనే ఒక సాధారణ ప్రశ్న ఏం చేస్తున్నావుతో  మొదలు అవుతుంది. అలాంటప్పుడే, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఆఖరికి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్లిన కూడా ఎలా ఉన్నావు..అని అడగడం కంటే, ఏం చేస్తున్నావు? అనే ఎక్కువ అడుగుతారు. 

అలా ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఏం చేయాలో తెలియని ఒక పాతికేళ్ల కుర్రాడు, ఎవ్వరు..ఎన్ని మాటలు అంటున్నా, వాళ్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ మాత్రం లేకుండా.. తను అనుకున్న గమ్యానికి ఎలా చేరుకున్నడనేది..ఏం చేస్తున్నావు కథ అనిపిస్తుంది.ఈ మూవీలో మంచి హెలికాప్టర్ సీన్ ఉంటుందని..ఈ సీన్ ఆడియన్స్ మనసుకి హత్తుకునేలా,ఎమోషనల్గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. .

ఏం చేస్తున్నావ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండటంతో..ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇది ప్రతి స్టూడెంట్ స్టడీ కంప్లీట్ అయ్యాక పేస్ చేసే కథాంశంతో వస్తుండటంతో..ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం కన్ఫర్మ్ అనిపిస్తోంది.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న గోపి సుందర్(Gopi sundar) మెలోడీ సాంగ్స్, వింటేజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది.  

ఏం చేస్తున్నావ్ మూవీ కామెడీ,డ్రామా,రొమాంటిక్ జోనర్ లో ఆద్యంతం ఆసక్తిగా కనిపిస్తోంది. డైరెక్టర్ భరత్ మిత్ర తమ్ముడు రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఆమని,C/o కంచరపాలెం రాజు.మధు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కంట్లం అనంతుల, శితికంత రాణా,విన్యాస్ వర్క్ చేశారు.సహ దర్శకుడుగా రామ్ జివి, ఎడిటర్ హరిశంకర్ టిఎన్, సినిమాటోగ్రాఫర్గా ప్రేమ్ అడివి టెక్నికల్ టీంగా ఉన్నారు.  

కాగా ఈ మూవీని ఎన్‌విఆర్(NVR) క్రియేటివ్ వర్క్స్  బ్యానర్ పై కురువ నవీన్(Kuruva Naveen) కురువ కిరణ్(Kuruva kiran) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏం చేస్తున్నావ్‌ మూవీ 2023 ఆగస్టు 25న థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.