ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" కు క్లీన్ U/A

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" కు క్లీన్ U/A

శ్రీమతి జగన్మోహని సమర్పణలో  విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట,  డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై  అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, కేజీఎఫ్, రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  "ఏనుగు". ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి నెక్స్ట్ సినిమా "ఏనుగు". హరితో కలిసి మేము మంచి కంటెంట్  ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న  సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో  ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగిందని నిర్మాతలు తెలిపారు. తెలుగులో దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ఇప్పుడు వస్తున్న కమర్శియల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" చిత్రం కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు సినిమా చాలా బాగుందని, U/A సర్టిఫికెట్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గోపీనాథ్ ఎక్సలెంట్ మేకింగ్ ఇచ్చారని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఏనుగు" చిత్రాన్ని జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాను తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ చేస్తున్నామని,  ఫ్యామిలీ తో వచ్చి చూసే విధంగా ఉన్న ఈ "ఏనుగు" సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందని,  అలాగే ఈ సినిమా చూసి బయటకు వచ్చిన  ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నామని వారు తెలిపారు. 

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ... మంచి కంటెంట్ తో వస్తున్న   "ఏనుగు" సినిమాలో  ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగిందన్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. ఫ్యామిలీ తో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని, ఇంతకుముందు తాను చేసిన చిత్రాలను ఆదరించి నట్లే   'ఏనుగు"  సినిమాను కూడా ఆదరించాలని కోరారు. 

నటీనటులు

అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, ఆడుకలం జయపాలన్, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగజ్

సాంకేతిక నిపుణులు

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: హరి

ప్రొడక్షన్ హౌస్: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌,డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్

నిర్మాతలు: సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

డీవోపీ: గోపీనాథ్

ఆర్ట్ డైరెక్టర్: మైఖేల్ B.F.A.,

ఎడిటర్ఆం: థోని

స్టంట్స్: అన్ల్ అరసు

సహ దర్శకుడు: ఎన్ జాన్ ఆల్బర్ట్ 

కొరియోగ్రఫీ: బాబా బాస్కర్, ధీనా 

వీఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ డిజైన్ : నాక్ స్టూడియోస్

సౌండ్ మిక్స్ : టీ ఉదయ కుమార్ 

చీఫ్ మేకప్ ఆర్టిస్ట్: మునియరాజ్ 

కాస్ట్యూమర్ : రంగసామి 

స్టిల్స్: శరవణన్ 

కాస్ట్యూమ్ డిజైనర్: నివేదా జోసెఫ్, గీతు 

పీఆర్వో: నాయుడు, ఫణి (బియాండ్ మీడియా)