ఎంగేజ్మెంట్ షూటింగ్ కంప్లీట్

ఎంగేజ్మెంట్ షూటింగ్  కంప్లీట్

ప్రవీర్ శెట్టి, ఐశ్వర్య గౌడ జంటగా రాజు బొనగాని దర్శకత్వంలో  జయరామ్ దేవ సముద్ర నిర్మిస్తున్న చిత్రం ‘ఎంగేజ్మెంట్’. శుక్రవారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి.. కూర్గ్, చిక్ మంగళూరు, మైసూర్, గోవా ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో అనుకున్న షెడ్యూల్స్‌‌‌‌లో  షూట్ పూర్తి చేశాం. అవుట్‌‌‌‌పుట్ కూడా ఊహించిన దాని కంటే క్వాలిటీగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.