ఆటోమెటిక్ ఫ్రూట్ పీలర్: ఒక్క బటన్ నొక్కితే చాలు.. 20 సెకన్లలో పండ్ల తొక్కలు తీసేస్తుంది..

 ఆటోమెటిక్ ఫ్రూట్ పీలర్: ఒక్క బటన్ నొక్కితే చాలు.. 20 సెకన్లలో పండ్ల తొక్కలు తీసేస్తుంది..

కీరా, యాపిల్‌‌‌‌ లాంటివాటి తొక్కలను ఈజీగా తీసేయొచ్చు. కానీ.. ప్లమ్‌‌‌‌, ద్రాక్ష లాంటి చిన్న సైజులో ఉండే పండ్ల తొక్కలు తీయాలంటే చాలా టైం పడుతుంది. కానీ.. ఈ ఆటోమెటిక్‌‌‌‌ ఫ్రూట్ పీలర్‌‌‌‌‌‌‌‌తో వాటి తొక్కలను చాలా ఈజీగా తీసేయొచ్చు. దీన్ని ఎనహోల్‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ఇది చెర్రీ టమోటాలు, వెల్లుల్లి లాంటి వాటి చెక్కులను కూడా ఈజీగా తీసేస్తుంది. ఇందులో 50 వాట్స్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ మోటార్ ఉంటుంది. దీని రోలింగ్ మెకానిజం 20 సెకన్లలోనే పని పూర్తి చేసేస్తుంది.

ఇది రీచార్జబుల్‌‌‌‌ లిథియం బ్యాటరీతో వస్తుంది. ఒకే బటన్‌‌‌‌తో ఆన్‌‌‌‌/ఆఫ్​ చేయొచ్చు. క్యాంపింగ్, అవుట్‌‌‌‌డోర్ కిచెన్ సెటప్‌‌‌‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐదు మన్నికైన పదునైన బ్లేడ్స్‌‌‌‌ ఉంటాయి. దీన్ని పూర్తిగా ఫుడ్‌‌‌‌ గ్రేడ్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌తో తయారుచేశారు.