‘ఎపిక్‌‌‌‌ – ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

‘ఎపిక్‌‌‌‌ – ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్‌‌‌‌ మిడిల్‌‌‌‌క్లాస్ ’ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌  ఫేమ్ ఆదిత్య హసన్‌‌‌‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఎపిక్‌‌‌‌ – ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌’.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌తోపాటు, ఫస్ట్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, మంగళవారం సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ‘ప్రియ సఖి’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌‌‌‌ను హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేయగా కేఎస్ హరిశంకర్ పాడిన తీరు బాగుంది.

‘‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది..  చంద్రుడు చూడని కొత్త వెన్నెల ఇది.. భూమికి తెలియని మట్టి వాసన ఇది.. ఏమిది..  కవులే రాయని కొత్త కావ్యమిది.. మునులే చెయ్యని కొత్త ధ్యానమిది.. దేవతలు ఎరుగని దివ్యలోకమిది.. ఏమిది.. ఏమిది.. జీవితాన్ని మార్చేశావే బుజ్జి నెమలి..  స్వర్గం లోతు చూపించావే పూల కడలి.. చిన్న పిల్లనైపోయానే స్పర్శ తగిలి.. ఉండలేనే.. నిన్ను వదిలి.. ప్రియసఖి.. ” అంటూ సురేష్ బనిశెట్టి క్యాచీ  లిరిక్స్ అందించారు.  లండన్   నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ స్టైలిష్‌‌‌‌గా ఉన్నాయి.  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. జులైలో సినిమా రిలీజ్‌‌‌‌కు సన్నాహాలు చేస్తున్నారు.