Life : ఓటమి కూడా ఓ గుణపాఠం.. భయం పోతే జీవితంలో విజయం ఖాయం..

Life : ఓటమి కూడా ఓ గుణపాఠం.. భయం పోతే జీవితంలో విజయం ఖాయం..

నేను ఒంటరి అయిపోయాను, ప్రపంచమంతా స్వార్థంతో నిండి పోయింది.... ఇది మనలో మనం చాలా సార్లు అనుకునే మాట. ఇంతకి ఒంటరి అవటం అంటే ఏమిటి? మనతో ఎవరూ లేకపోవటం అంతే కదా.కానీ మనం మర్చిపోతున్న విషయం ఒకటుంది. అది 'మనలో మనం ఉన్నాం' అని. మనమీద మనకు నమ్మకం లేనప్పుడే చిన్న ఫెయిల్యూర్ ని కూడా భరించలేకపోతున్నాం అంటే... మనల్ని మనం నమ్మటం లేదన్నట్టే. మనలో భయం పోయినప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది అన్న ది ఒక చైనా సామెత. భయపడటం అంటే మనలో ఉన్న బలాన్ని గుర్తించలేక పోవటమే.... అందుకే మనల్ని మనం నమ్మాలి.

ఓటమి కూడా విజయమే...

ఎగ్జాం.. ఇంటర్వ్యూ కొత్త స్టార్టర్ ఏదైనా కానీ అదే చివరి ప్రయత్నం కాదు అనే ఆలోచన దాకా రాకపోవటం మనమీద మనకు నమ్మకం లేకపోవటమే. ఈ ఒక్క బలహీనత మీద పర్సనాలిటీ డెవలప్ మెంట్ పేరుతో వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. నిజానికి పర్సనాలిటీ డెవలప్​ మెంట్ మీద వచ్చిన పుస్తకాలు కానీ, జరిగే క్లాసులు కానీ మొత్తంగా చెప్పేది ఒకటే మిమ్మల్ని మీరు నమ్మండి... మీలో ఉన్న శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అని..

పరాజయాలు పాఠం నేర్పటానికే

ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకు సలహాలిచ్చేవాళ్ళు వందల్లో ఉంటారు. కానీ వాటిలో ఏది ఫాలో అవ్వాలో మనకు మాత్రమే తెలుస్తుంది. పుట్టినదగ్గరినుండీ ఎన్నిటిని ఎదుర్కొని ఉంటాం. ఎన్ని కొత్త విషయాలని నేర్చుకుని ఉంటాం. కొత్తగా వచ్చిన ఒక్క ఫెయిల్యూర్ కి ఇప్పుడు కుంగిపోవటం ఎందుకు? అన్న ప్రశ్న చాలు మళ్ళీ మనం చినిలబడటానికి. “ఒకరిలా అవ్వాలని ప్రయత్నించకు. నువ్వు ఇప్పటికే ఒకలా అయిపోయావు మారలేవు మార్చుకోలేవు..

నువ్వు కేవలం నీలో ఉన్నదేంటో తెలుసుకోవాలంతే" అంటారు. ఓషో ఎవరు ఏది చెప్పినా మననిర్ణయమే చివరిది అనుకున్నప్పుడు అప్పటి వరకూ ఉన్న డిప్రెస్ట్​ ఫీలింగ్ కనిపించదు. పసి ప్రాయంలో ఒక్క అడుగు వేయలేక కిందపడ్డవాళ్లే. నేడు ఎవరెస్టు శిఖరాన్ని తమకాళ్లకింద చూసుకుని ఆనందిస్తున్నారు. పరాజయాలు ఉన్నదే మనకు పాఠం నేర్పటానికి, ప్రపంచాన్ని ప్రభావితంచేయగల వ్యక్తులు చాలామంది అలాంటి పాఠాలు నేర్చుకున్నవాళ్లే..

కుక్క మాంసాన్ని తిని..

జె.జె. రోలింగ్ రాసిన హ్యారీ పోటర్ నవ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, మొదటి హ్యారీ పోటర్ నవలను 13 సార్లు పబ్లిషర్లు రిజెక్ట్ చేశారు. అయినా... ఆ తిరస్కరణలే రౌలింగ్ కు పాఠం నేర్పాయి. అమెరికన్ రచయిత స్టీఫెన్ హాకింగ్స్ రచించిన మోస్ట్ పాపులర్ నవల క్యారీ సార్లు 'నో' అనిపించుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం నుంచి తేరుకున్న జపాన్ మసారు ఇబుకా అడియో మోరిటా కలిసి ఓ ఎలక్ట్రానికి రైస్ కుక్కర్​ ను తయారు చేశారు. కుక్కర్ పనితీరు ఏమాత్రం బాగుండేది కాదు. అందులో అన్నం వండితే ఒక్కోసారి సరిగ్గా ఉడికేది కాదు. తినడానికి వీల్లేకుండా తయారయ్యేది. అయినా వాళ్లిద్దరూ వెనకడుగు వేయలేదు.

ఎంతో కష్టపడి ఆ లోపాలను సరిదిద్దారు. అంత కష్టపడ్డా వారు అమ్మగలిగింది వంద కుక్కర్లు మాత్రమే! ఈ ఎదురుదెబ్బల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే వారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు సంస్థ టోక్యోత్యు షీన్ కోగ్యోను మొదలు పెట్టారు. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సోనీ, వైఫల్యాలు విజయానికి మార్గం చూపుతాయి.

సైంటిస్టులు కొత్తవి కనిపెట్టేవాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పే మాట ఇదే. అందుకు కరెంట్​ బల్బు తయారీ కోసం థామస్ అల్వా ఎడిసన్ పడిన తమన ఓ చక్కని ఉదాహరణ కరెంట్​ బల్బ్​నుంచి వెలుతురు చూసేందుకు థామస్ ఎడిసన్ దాదాపు 3,000 ప్రయత్నాల్లో ఫెయిలయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు.. ఆఖరికి అనుకున్నది సాధించారు.

వాల్ట్ డిస్నీ స్థాపించిన తొలి యానిమేషన్ సంస్థ న్యూమాన్ లాఫ్ గ్రామ్ 1920లో ఆ సంస్థకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఎంతగా అంటే కనీసం కిరాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి. కడుపు నింపుకునేందుకు బలవంతంగా కుక్క మాంసాన్ని తినేవాడట వాల్ట్ డిస్నీ అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన 1966 లో చనిపోయే నాటికి ప్రస్తుతం మన లెక్కలో చెప్పుకోవాలంటే దాదాపు 32 వేల కోట్ల రూపాయలు సంపాదించారు..

ఒకప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళే

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సక్సెస్​ ఫుల్​ అనిపించుకున్న వాళ్ళంతా ఒకప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళే ప్రతిభ గురించి పెట్టుకున్న.. నమ్మకాలు తుడిచి పెట్టుకు పోయే ఫెయిల్యూర్ ఎదురైతే ఎవరైనా ఒక అడుగు వెనక్కి వేస్తారు. కుంగిపోవడం, చేసే పనినుంచి తప్పుకోవటం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం కనిపిస్తుంటుంది. కానీ చరిత్రలో తిరుగులేని విజయాలు సాధించిన ఏ మనిషిని చూసినా గెలుపు కన్నా అతని ఓటమే ముఖ్యమని తెలుస్తుంది. 

సామాన్యంగా అందరికీ గొప్పపని చేసేందుకు సహజమైన క్యాపబిలిటీ ఉండదు. ఆ పని చేయటానికి పది లక్షణాలు కావాల్సివస్తే మహా అయితే అందులో అయిదారు ఉంటాయి. మిగిలినవి ఫెయిల్యూర్స్ ద్వారా నేర్చుకుని ముందుకు వెళ్తారు. ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు. మనగల్లీ చివర టిఫిన్ బండి పెట్టుకునో, చిన్న షాప్​ లో  స్టేషనరీ అమ్ముతూనో లేదా మరేదైనా పని చేస్తూనో కనిపిస్తారు. కాకుంటే మనం దాన్ని  సక్సెస్ అని గమనించ లేక పోవటమే మన సమస్య. ఓడటం, గెలవటం రెండూ అబద్దాలే అనుకున్నప్పుడు మనకు మనం ఒంటరి అనిపించదు. ఏ డిప్రెషన్ సక్సెస్ అడ్డురాదు..
 
వెలుగు, లైఫ్​