కొందరు గంటల తరబడి ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. దాంతో ఫోన్ వేడెక్కి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంటుంది. ఈ సమస్యకు సొల్యూషన్‌గా ఇవోఫాక్స్ అనే కంపెనీ ఫోన్ కూలర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది సెమీకండక్టర్ కూలింగ్ టెక్నాలజీ (పెల్టియర్ ఎఫెక్ట్)తో పనిచేస్తుంది. అందువల్ల చాలా తక్కువ టైంలోనే ఫోన్ టెంపరేచర్‌ని తగ్గించి ఓవర్‌హీటింగ్‌ను నివారిస్తుంది.
ఫ్యాన్ 15వాట్స్ పవర్‌తో 5000 ఆర్‌పీఎం స్పీడ్‌తో తిరుగుతుంది. ఇందులో 7-బ్లేడ్ల ఫ్యాన్, 3 కూలింగ్ మోడ్స్, రియల్-టైమ్ టెంపరేచర్ డిస్‌ప్లే, వైబ్రంట్ ఆర్‌జీబీ లైటింగ్ ఉన్నాయి.
క్లాంప్ మౌంట్ డిజైన్‌తో రావడం వల్ల ఏ ఫోన్‌కైనా సులభంగా అటాచ్ చేయొచ్చు. ట్రైపాడ్ మౌంట్ సపోర్ట్ కూడా ఉంది. దీన్ని 15వాట్స్ టైప్– సీ- పవర్ ఇన్‌పుట్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. దీని బరువు 78 గ్రాములు మాత్రమే.

