పండగనాడు మాజీ సర్పంచ్ ఇల్లు దగ్ధం

పండగనాడు మాజీ సర్పంచ్ ఇల్లు దగ్ధం
  • షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం

జగిత్యాల జిల్లాలో ఉగాది పండుగనాడు ఓ గ్రామ ప్రజా ప్రతినిధి ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం కావడం విషాదం రేపింది. కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మాజీ సర్పంచి బరిగే లక్ష్మీ ఇల్లు దగ్ధం అయింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిపోయింది. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు సమాచారం. గత ఏడాది కరోనా భయంతో పండుగ జరుపుకోలేకపోయిన ప్రజలు ఈసారి కాస్త ఉత్సాహంతో పండుగ జరుపుకుంటుండగా అగ్ని ప్రమాదం జరగడం గ్రామంలో విషాదం రేపింది. చుట్టుపక్కల ఇండ్ల వాళ్లు ప్రమాదాన్ని గుర్తించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేలోగానే ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో క్షణాల్లో కాలిబూడిదైంది. పైకప్పు పూర్తిగా కాలిపోయి మొత్తం కూలిపోయింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తు సామాగ్రి అన్ని కాలి బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం లేకపోయినా.. గ్రామ మాజీ సర్పంచి ఇల్లు పండుగనాడు కాలిబూడిద కావడం వారి కుటుంబీకులను ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతీసినట్లు స్థానికుల సమాచారం.