ఎక్స్‌‌‌‌ట్రా.. సెకండ్  సాంగ్‌‌‌‌ కోసం ముహూర్తం ఫిక్స్

ఎక్స్‌‌‌‌ట్రా..  సెకండ్  సాంగ్‌‌‌‌ కోసం ముహూర్తం ఫిక్స్

నితిన్, శ్రీలీల  జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎక్స్‌‌‌‌ట్రా’. ఆర్డినరీ మేన్ అనేది ట్యాగ్‌‌‌‌లైన్.  శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈమూవీ డిసెంబర్ 8న విడుదల కానుంది. ఇప్పటికే ‘డేంజర్ పిల్లా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

‘బ్రష్ వేస్కో’ అంటూ సాగే సాంగ్‌‌‌‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కొత్త లుక్‌‌‌‌తో నితిన్ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్.