వీడిదే బోడిగుండు : బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్

వీడిదే బోడిగుండు : బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్

ఈజీగా మనీ సంపాదించేందుకు డాక్టర్ గా అవతారమెత్తిన ఓ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బట్టతలపై వెంట్రుకలు తెప్పిస్తానంటూ ట్రీట్మెంట్ చేస్తున్న నకిలీ డాక్టర్ అస్లాంను అదుపులోకి తీసుకున్నారు.  బట్టతలతో పాటుగా చర్మ రోగాల నివారణ కొరకు ట్రీట్మెంట్ చేస్తానంటూ అస్లాం ప్రచారం చేసుకుంటున్నాడు.  

గతంలో గచ్చిబౌలిలో ఓ హెయిర్ ట్రాన్సప్లాంట్ హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్ గా పని చేసిన అస్లాం.. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై కొద్దీగా అవగాహన సంపాదించాడు. దీంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఓల్డ్ సిటీలో  క్లినిక్ ఓపెన్ చేశాడు.  హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.  

Also Read: భారత్లో 30 శాతం మందికి బీపీ లేదు

అస్లాం దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో అస్లామ్ అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.  అస్లామ్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.