లేబర్ కమిషనర్నంటూ ఎమ్మెల్యేకే టోకరా

లేబర్ కమిషనర్నంటూ ఎమ్మెల్యేకే టోకరా

లేబర్ కమిషనర్ ను అంటూ  వసూళ్లకు పాల్పడిన ఓ వక్యిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా  చిరు వ్యాపారుల  వద్ద డబ్బులు వసూలు చేస్తూ దొరక్కుండా  అధికారులకు చుక్కలు చూపెడుతున్నాడు. దీంతో అతని టార్చర్ తట్టుకోలేక బాధితులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ కు రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే ఫోన్ చేసినా.. బెదరకుండా తాను  లేబర్ కమిషనర్ నంటూ మాట్లాడిండు. దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ టూ టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి నిందితుడిని కడప జిల్లా బీకుడూరు చెందిన వ్యక్తి గుర్తించి అరెస్ట్ చేశారు.