కామారెడ్డి కలెక్టర్ ఫొటోతో ఫేక్ అకౌంట్.. డబ్బులు వసూలు చేసే యత్నం?

కామారెడ్డి కలెక్టర్ ఫొటోతో ఫేక్ అకౌంట్.. డబ్బులు వసూలు చేసే యత్నం?

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేరు, ఫొటోను ఉపయోగించి సోషల్ మీడియాలో నకిలీ ఖాతా సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా నిర్వహిస్తున్న విషయాన్ని కలెక్టరేట్ అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అకౌంట్ సృష్టించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని పోలీసులను కోరారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ఖాతాకు సంబంధించిన ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్ ఆధారంగా దాని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ చేపట్టారు. ఈ ఖాతాను ఎవరు సృష్టించారు? ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు? డబ్బుల వసూళ్లకు ప్రయత్నించారా? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.