కె–డ్రామా ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్..  కొరియన్ బ్యూటీ కోసం గ్లాసీ స్కిన్ మేకప్ టిప్స్

కె–డ్రామా ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్..  కొరియన్ బ్యూటీ కోసం గ్లాసీ స్కిన్ మేకప్ టిప్స్

కె- డ్రామాలో కుటుంబం ఎంత ముఖ్యమో పెద్దలకు గౌరవం, ప్రేమ, ఎమోషన్స్​ను కంట్రోల్ చేసుకోవడం వంటివన్నీ అంతే ముఖ్యం అనేదే సారాంశం. మనదేశంలో ప్రతి ఇంట్లో లేదా జాయింట్ ఫ్యామిలీస్​లో రోజూ చూసే సీన్లే కె – డ్రామాల్లోనూ కనిపిస్తాయి. అయినా సరే కె– డ్రామాల్లో ఇవన్నీ చూస్తే మనవాళ్ల మనసు ఐస్​లా కరిగిపోతోంది. 

మొదట్లో కె – డ్రామాలను పాతికేండ్లలోపు వాళ్లు, టీనేజర్స్ ఎక్కువగా చూసేవాళ్లు. కానీ ఓటీటీల్లో కె –- డ్రామా వ్యూస్ పెరిగినప్పటి నుంచి 30 ఏళ్లు దాటినవాళ్లు కూడా హిందీ డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూస్తున్నారు. ఇది కేవలం యూత్ ట్రెండ్ కాదు.. ఇది ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అయిపోయింది.

మన సినిమాల్లో హీరోలు మాస్​ ఇమేజ్​తో ఆడియెన్స్​ని అట్రాక్ట్ చేస్తుంటారు. కానీ కొరియన్ హీరోలు అలా కాదు. హీరోలైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. క్షమాపణలు అడుగుతారు. వంట చేస్తారు. భావోద్వేగాలను ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎక్స్​ప్రెస్​ చేస్తారు. ఈ ‘సాఫ్ట్ మాస్కులినిటీ’ మహిళలను, యువతులను ఎంతో ఆకట్టుకుంటోంది. 

బీటీఎస్​, బ్లాక్​ పింక్ వంటి కె – -పాప్ మోడల్స్​ను ఐడల్స్​గా భావిస్తున్నారు. వాళ్ల ఫ్యాషన్, స్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, సెల్ఫ్- లవ్.. ఇవన్నీ జెండర్​కు అతీతంగా ఉంటాయి. ఇప్పుడు మనదేశంలోని అమ్మాయిలు కూడా కొరియన్​ బ్యూటీ కోసం ‘గ్లాసీ స్కిన్​’ మేకప్​ టిప్స్ ఫాలో అవుతున్నారు. 

మన ప్లేట్​లో కొరియన్ ఫుడ్​ 

 స్విగ్గీ 2025 రిపోర్ట్ ప్రకారం.. బెంగళూరు, ముంబైలో కొరియన్ ఫుడ్ ఆర్డర్లు 50 శాతం పెరిగాయి. సూరత్, మైసూరు వంటి టైర్-2, 3 సిటీల్లో కూడా 59 శాతం గ్రోత్ ఉంది. కిమ్చి, టోక్బోక్కి, కొరియన్ ఫ్రైడ్ చికెన్, రామెన్ వంటి కె– డ్రామాల్లో చూసిన ఫుడ్ ఐటెమ్స్​ ఇప్పుడు మన ప్లేట్​లో ఉంటున్నాయి. ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్డ్ టీ-షర్ట్స్, పేస్టల్ కలర్స్, మినిమలిస్ట్ లుక్..  కాలేజీలు, సోషల్ మీడియాల్లో ఇవి ట్రెండ్ అయిపోయాయి. 

కె–- పాప్ బ్యాండ్స్ బీటీఎస్​, బ్లాక్ పింక్, ట్వైస్​.. వీళ్ల పాటలు ఇప్పుడు ఇండియన్ డ్యాన్స్ స్టూడియోలు, కాలేజీ ఫెస్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా వినిపిస్తాయి. కె – డ్రామాల్లో యానిమేటెడ్ సిరీస్ కూడా గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టాప్​లో ఉంది. అంతేకాదు.. ఆ డ్రామాల్లోని డైలాగ్స్, పాటల్లోని లిరిక్స్ అర్థం చేసుకోవాలని ఆసక్తితో మనదేశంలో కొరియన్ భాష నేర్చుకునేవారు 75 శాతం పెరిగారని ‘డుయొలింగో’ రిపోర్ట్ చెప్తోంది. ఇప్పుడు భారతదేశంలో15 మిలియన్ల మందికి పైగా కొరియన్ కల్చర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదీ మనవాళ్లకు కొరియన్​ కల్చర్​తో ఉన్న కనెక్షన్.