
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘దేఖొరో దెఖో..’ సాంగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌ను చూపిస్తూ సాగిన టీజర్ ఆకట్టుకుంది. సర్ నేమ్‌కు సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు.
దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటుంటాడు విజయ్. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. అతని బడ్జెట్ ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. హీరోయిన్ మృణాల్ ‘నేను కాలేజ్‌కు వెళ్లాలి. కొంచెం దించేస్తారా..
’ అని అడిగితే..‘లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ అంటాడు. ఇలా హీరో క్యారెక్టర్‌లో ఉన్న కంప్లీట్ ఫ్యామిలీమేన్‌ను ఎలివేట్ చేశారు. వాసుకి, అభినయ కీలక పాత్రల్లో కనిపించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.