క్రేజీ అప్‌‌‌‌డేట్ : ఫ్యామిలీ స్టార్‌‌‌‌‌‌‌‌ టీజర్ వస్తుంది

క్రేజీ అప్‌‌‌‌డేట్ :  ఫ్యామిలీ స్టార్‌‌‌‌‌‌‌‌ టీజర్ వస్తుంది

గతేడాది ‘ఖుషి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో  ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌‌‌‌‌’గా రాబోతున్నాడు.  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ  ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన  పోస్టర్స్, గ్లింప్స్,  ఒక  సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచగా, శుక్రవారం ఓ క్రేజీ అప్‌‌‌‌డేట్ ఇచ్చాడు విజయ్. తన సోషల్ మీడియా పేజ్‌‌‌‌లో ‘టీజర్ వస్తుంది’ అంటూ తెలుగు, తమిళ భాషల్లో పోస్ట్ చేశాడు. సినిమా  రిలీజ్‌‌‌‌కు నెల రోజులు మాత్రమే ఉండటంతో అప్‌‌‌‌డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌‌‌‌ను ఈ న్యూస్‌‌‌‌తో జోష్‌‌‌‌లో నింపాడు.  

ఇందులో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌లా కనిపించనున్నాడు.  మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వాసు వర్మ  క్రియేటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా  వ్యవహరిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత ఆరేళ్ల గ్యాప్‌‌‌‌తో విజయ్, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతోన్న  ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌పై  అంచనాలు ఏర్పడ్డాయి.