ఇకనైనా ఆ బ్రో డాడీ ఆపేయన్నా.. మెగాస్టార్కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

ఇకనైనా ఆ బ్రో డాడీ ఆపేయన్నా.. మెగాస్టార్కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని ఆయన ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ముందే చెప్పాం ఇలా అవుతుందని. కనీసం ఇప్పటికైనా ఆ బ్రో డాడీ(Bro Daddy)ని ఆపేయన్నా అంటూ చాలా దీనంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కు వచ్చిన పరిస్థితి ఏ ఫ్యాన్స్ కు రాకూడదు అనిపిస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar) ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. మెహర్ రమేష్(Meher Ramesh)తెరకెక్కించిన ఈ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. సినిమాలో చిరు యాక్టింగ్ బాగున్నా.. కంటెంట్ అవుట్ డేటెడ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి భోళా శంకర్ సినిమాపై ముందు నుండే బజ్ లేదు. ఎందుకంటే ఇది తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం(Vedalam)కు రీమేక్.

ప్రస్తుతం ఆడియన్స్ రీమేక్ సినిమాలను చూసేందుకు పెద్దగా ఇష్టపడటంలేదు. చిరు రీ ఎంట్రీ తరువాత భోళా శంకర్ మూడో రీమేక్. ఈ మూడు రీమేక్ లలో రెండు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇప్పుడు భోళా శంకర్ కు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యేలాగే ఉంది. ఒకప్పుడు సోషల్ మీడియా, ఓటీటీ ఇంతగా అందుబాటులో లేదు కాబట్టి రీమేక్ సినిమాలకు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగుంది అంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను చూసేస్తన్నారు ఆడియన్స్. అందుకే రీమేక్స్ రిజల్ట్ తేడాగా ఉంటోంది. 

ఇక తాజాగా చిరు మరో రీమేక్ కు రెడీ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో యావరేజ్ హిట్ గా నిలిచిన బ్రో డాడీ సినిమాను రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నారట చిరు. ఈ సినిమాను సోగ్గాడే చిన్నినాయన(Soggade Chinninayana) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan krishna kurasala) దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. అందుకే మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. భోళా రిజల్ట్ చూసైనా ఈ బ్రో డాడీ రీమేక్ ను ఆపేయండి అన్నయ్యా అంటూ మెగాస్టార్ ను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ మాట విని ఈ రీమేక్ సినిమాను ఆపేస్తారా అనేది చూడాలి.