230 అడుగుల భారీ కటౌట్తో ప్రభాస్ బర్త్డే వేడుకలు.. ఎక్కడో తెలుసా?

230 అడుగుల భారీ కటౌట్తో ప్రభాస్ బర్త్డే వేడుకలు.. ఎక్కడో తెలుసా?

ఇవాళ సోమవారం (అక్టోబర్‌ 23న) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో హైద్రాబాద్ నగరం కిక్కిరిసేలా కనిపిస్తోంది. ప్రభాస్ కోసం కాలర్ ఎగరేసే ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..ప్రపంచ దేశాలలో కూడా ఉన్నారు. ఇక మన తెలుగు హీరో..మన డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అంటే..ఏ విధంగా ఉండనుందో తెలపడానికి మాటలు లేక..భారీ కటౌట్ తో చూపించడానికి రెడీ అయ్యారు ఫ్యాన్స్. 

శ్రేయాస్ మీడియా, సురేంద్రపురి ఆధ్వర్యంలో 230 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఖైత్లాపూర్ గ్రౌండ్లో నిలువెత్తు ప్రభాస్ ను చూడబోతున్నాం.ఈ గ్రౌండ్ లో ప్రభాస్ వేడుకలను ఘనంగా జరపనున్నారు. ఇందుకోసం భారీగా ప్రభాస్ ఫ్యాన్స్ హైదరాబాద్ కు వస్తున్నారు.

కత్తులతో యుద్ధ వీరసైనికుడిలా ఉన్న సలార్ కటౌట్ అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్.. మా డార్లింగ్ అదిరిపోయాడు అంటూ సోషల్ మీడియాలో విషెష్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ కటౌట్ కు సంబంధించిన పోస్టర్స్..వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇవాళ ప్రభాస్ నుంచి అప్డేట్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో.. మారుతీ కాంబోలో హ్యూమర్ టచ్తో వస్తోన్న మూవీకు సంబంధించిన పోస్టర్..రిలీజ్ చేసే అవకాశం ఉండగా..అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న..సలార్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక సంక్రాంతి బరిలో ఉన్న కల్కి మూవీ నుంచి కూడా స్పెషల్ ట్రీట్ ఉండే ఉంటుందని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

అంతేకాకుండా..అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తోన్న స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక ప్రభాస్ బర్త్డే వేడుకలతో మేకర్స్..ఫ్యాన్స్ ఆశ‌లు తీరుస్తారా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.