ఆడియన్స్ కు శానిటైజర్లు, మొక్కలు పంచిన విజయ్ ఫ్యాన్స్

ఆడియన్స్ కు శానిటైజర్లు, మొక్కలు పంచిన విజయ్ ఫ్యాన్స్

ముంబైలోనూ మాస్టర్ సినిమా ఫీవర్ కనిపిస్తోంది. థియేటర్ల దగ్గర ఇళయ దళపతి విజయ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. టపాసులు పేల్చుతూ, డ్రమ్స్ బీట్ కు డాన్సులేస్తున్నారు. మూవీకి వచ్చిన ఆడియన్స్ కు శానిటైజర్లు, మొక్కలు పంచుతున్నారు.

చెన్నైలోనూ..

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ కు ఒకే రోజు రెండు పండుగలొచ్చాయి. ఇవాళ విజయ్ నటించిన మాస్టర్ సినిమా రిలీజ్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. చెన్నై థియేటర్లు భారీ కటౌట్లతో నిండిపోయాయి. సినిమాహాళ్ల దగ్గర తెల్లవారు జాము నుంచే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.