స్పీడ్ పెంచిన ‘చిట్టి’ 

స్పీడ్ పెంచిన ‘చిట్టి’ 

ఐదడుగుల పదంగుళాల పొడవుతో అందరినీ ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’ చిట్టిగా తన నటనతోనూ మెప్పించింది. ఆ తర్వాత జెట్‌‌ స్పీడులో దూసుకుపోతుంది అనుకుంటే.. సెకెండ్ సినిమా సైన్ చేయడానికి చాలా సమయం తీసుకుంది. ఇప్పుడు సంతోష్ శోభన్‌‌తో నటించబోతోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

రీసెంట్‌‌గా సంతోష్‌‌ హీరోగా వచ్చిన ‘ఏక్ మినీ కథ’కి గాంధీయే స్టోరీ అందించాడు. ఇప్పుడు తనతో ఈ రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ప్లాన్ చేశాడు. ఇందులో తనది చిట్టి కంటే స్ట్రాంగ్ రోల్ అని, యూత్‌‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఫరియా అంటోంది. ఇక రవితేజ హీరోగా రూపొందుతున్న ‘రావణాసుర’లోనూ ఫరియా నటించనుందని టాక్. ప్రియాంక అరుళ్ మోహన్ ఫిమేల్​ లీడ్​గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫరియా సెకెండ్ హీరోయిన్‌‌గా యాక్ట్ చేస్తోందట. ఇక ఫరియా ‘బంగార్రాజు’ సినిమాలో ఐటమ్ సాంగ్‌‌ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట నెట్‌‌లో వైరల్ కావడంతో ఆమె ఫుల్ ఖుష్ అవుతోంది. ఏదేమైతేనేం..  ఇప్పటికైనా ఆమె కెరీర్‌‌‌‌ స్పీడందుకుంది.