బ్రిటీష్ వాళ్లే రైతు చట్టాలను ఉపసంహరించుకున్నారు.. మీరెందుకు చేయరు?

బ్రిటీష్ వాళ్లే రైతు చట్టాలను ఉపసంహరించుకున్నారు.. మీరెందుకు చేయరు?

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. వ్యవసాయ చట్టాలపై రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదన్నారు. జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసలో తప్పిపోయిన వారిని వెదికేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లిక్ డే నాడు జరిగిన హింసకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.