సోచ్ రెడ్ డాట్ సేల్‌‌ షురూ

సోచ్  రెడ్ డాట్ సేల్‌‌ షురూ

న్యూఢిల్లీ : ఫ్యాషన్​ రిటైలర్​ సోచ్​ రెడ్​ డాట్​ పేరుతో ప్రత్యేక సేల్​ను ప్రారంభించింది. అన్ని సోచ్ స్టోర్లు,  ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫారమ్‌‌లలో మునుపెన్నడూ లేని ధరలలో 2000  కంటే ఎక్కువ స్టైల్స్ అందుబాటులో వున్నాయని ప్రకటించింది. వివిధ రకాల ఎత్నిక్ వేర్లపై 50 శాతం డిస్కౌంట్​ ఉంది. 

చీరలు, సల్వార్ సూట్లు, కుర్తాలు, కుర్తా సెట్‌‌లు, డ్రెస్ మెటీరియల్‌‌లు, ట్యూనిక్స్,  కఫ్తాన్‌‌లపై ఆఫర్లు ఉన్నాయని, ఎత్నిక్​ కలెక్షన్​పై చాలా డీల్స్​ ఉన్నాయని సోచ్​ తెలిపింది.  రెడ్ డాట్ సేల్​లో ధరలు రూ.  749 నుంచి మొదలవుతాయి. తాజా ఆఫర్‌‌లను తెలుసుకోవడానికి, అప్‌‌డేట్‌‌లను పొందడానికి తమ వెబ్​సైట్​లేదా సోషల్​ మీడియా ప్లాట్​ఫారాలను చూడాలని సోచ్​ కోరింది.