Fathers day 2025: నాన్న గొప్పతనం వెలకట్టలేనిది.. కోపంలో బాధ్యత.. మాటల్లో ప్రేమ

Fathers day 2025:  నాన్న గొప్పతనం వెలకట్టలేనిది.. కోపంలో బాధ్యత.. మాటల్లో ప్రేమ

నాన్న తన పిల్లల ఎదుగుదల కోసం కష్టపడే వ్యక్తి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనివి. సమాజంలో ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నాన్నను గౌరవించడానికి ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం( 2025, జూన్​ 15) ఫాదర్స్ డే సందర్భంగా నాన్నల గొప్పతనంపై స్పెషల్​ స్టోరీ... 

నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది.  అమ్మ తొమ్మిది నెలలు మోసి జన్మనిస్తే.. నాన్న తన జీవితమంతా పిల్లలను మోస్తాడు. నిస్వార్థ ప్రేమతో గుండెల మీద ఆడుకుంటూ జీవితానికి మార్గం చూపే మార్గదర్శి తండ్రి.  

చాలామందికి నాన్న అయిన తరువాతనే  నాన్న విలువ ఏంటో తెలుస్తుంది.  మా నాన్న  ఇన్ని బాధలు, బాధ్యతల్ని ఎట్లో మోశాడు? పిల్లలు చేసే అల్లరి, వాళ్లకు కొంచెం సుస్తీ చేసినా గుండెలో అలజడి! ఇవన్నీ ఎట్లా భరించాడు? అని నాన్న అయినతరువాతనే ప్రశ్నించుకుంటారు. అప్పుడే అర్ధమవుతుంది. .. నాన్న వేసిన బాటలో నా అడుగులు పడుతున్నాయని ...  ఆ టైంలో నాన్న వైపు చూస్తే.. నా పిల్లల కోసం ఆ గ్రేట్ మ్యాన్ ఇప్పుడు తాతగా మారాడు. చిన్నపిల్లాడిలా వాళ్లని ఆడిస్తున్నాడు. కథలు చెప్తూ బుద్ధులు నేర్పుతున్నాడు. తన బిడ్డకు కష్టం రావొద్దని.. మళ్లీ నా కష్టాన్ని పంచుకుంటున్నాడని అనిపిస్తుంది.  ఇదే నాన్న గొప్పతనం.. 

జీవివితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో!  ఈ ముచ్చట ప్రపంచానికి తెలియదు కాని ...  ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు. ఎవరి నాన్న వాళ్లకు గ్రేట్! చిన్నప్పుడు స్కూల్లో...  మా నాన్న సూపర్ హీరో ...అంటే ...మా నాన్న సూపర్ హీరో.... పోటీపడి కథలు చెప్పుకున్నారు కదా..మీరు .. మీ స్నేహితులు.  మా నాన్నకు మస్తు బలం ఉంటదిరా భయ్.. నేను  పెద్ద అయిన తరువాత మా నాన్నలెక్కనే అవుతానని  అంటారు. నాన్న ప్రభావం అలా ఉంటుంది

 నాన్న  అడిగింది తెచ్చిఇస్తాడు. ఏ ప్రశ్న అడిగినా ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్తాడు. పదోతరగతి వరకు నాన్న ..నాన్నలాగ కనిపిస్తాడు. ఆ తర్వాత నాన్నలో ఒక మంచి దోస్తును చూస్తాము . ఏ దారి ఎట్లాంటిదో వివరించి చెప్తాడు. ఆ వయసులో చిన్నచిన్న విషయాలకే చిరాకు పడ్తున్నా.. కూల్ గా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆయనొక గొప్ప సైకాలజిస్ట్ గా కనిపిస్తాడు.

నాన్న ప్రేమ అర్థం కాదు

తీట పని చేసినప్పుడు వీపు వాయించు  అని ఏదో మీ మాటకు అమ్మతో అని వెనకేసుకొస్తాడు. అది పెద్ద తప్పులాగ అనిపిస్తే మాత్రం కసురుకుంటాడు. అదే మాట కసిరింపు అమ్మ నోట్లో వస్తే పట్టించుకోరు. ..కానీ, నాన్న నోట్లోనుంచి వస్తే మాత్రం కోపం, దుఖం తెచ్చుకుంటారు. అమ్మ ఎంత తిట్టినా బాధపడరు కానీ, నాన్న ఓ మాట అంటే చాలు నొచ్చుకుంటారు. నాన్న ప్రేమ అర్థం కాదు. తల్లి ప్రేమలా అది స్పష్టంగా బయటకు కనపడదు. ఎవరన్నా తన పిల్లలను పొగుడుతున్నప్పుడు లోలోపల ఆనందపడుతూనే, వాళ్లతో 'చాలు తీ' అని ఇష్టం లేనట్టు నటిస్తాడు! దిష్టి తగులుతుందేమోనని తన పిల్లలను ఎక్కువగా పొగడనియ్యడు!

ఏం కోరుకుంటాడు?

తన పిల్లల్ని గొప్ప స్థానంలో చూడాలనుకుంటాడు నాన్న. దానికోసం నేనేం అయిపోయిన పర్వాలేదు.. అని తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. లాస్ట్​కు సాధించినా... సాధించకున్నా ఆయన కోరుకునేది ఒక్కటే..నాన్న... అనే పిలుపు. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. ఆ పిలుపు కోసమే వాళ్లు అన్నీ త్యాగం చేస్తారు. కాబట్టి ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా అప్పుడప్పుడు వాళ్ల కళ్లకు కనిపించి పోవాలె. రోజూ కనీసం ఫోన్లోనైనా  వినిపిస్తుండాలి

ఫాదర్స్​ డే వెనుక...

సొనరాది అమెరికాలోని వాషింగ్టన్ పక్కన చిన్న గ్రామం. ఆమెకు ఆరు నెలల వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి స్మార్ట్ విలియమ్ వ్యవసాయం చేస్తూ తల్లి లేని లోటు తెలియకుండ ఆమెను పెంచాడు. పాలు పట్టడం, స్నానం చేయించడం, జోలపాడి నిద్రపుచ్చడం.. అన్నీ చేశాడు. ఆ టైంలో ఇంకో పెండ్లి చేసుకునే అవకాశం ఉన్నా.. తన సుఖం కన్నా తండ్రి పాత్రకు న్యాయం చెయ్యాలనున్నాడు. తల్లి అనే ఊహ కూడా రానీయకుండ పెంచాడు. పెద్ద అయిన తరువాత  వాళ్ల నాన్న ఎంత గొప్ప వ్యక్తి గుర్తించింది. 

సొనరా ..మా నాన్న గ్రేట్ ఫాదర్ .. అని ఆయన పుట్టిన రోజును ..ఫాదర్స్ డేగా ..జరపాలనుకుంది. వాళ్ల నాన్న జూన్​లో  పుట్టాడని తెలుసుగానీ, ఎప్పుడు పుట్టిండో తెల్వదంట అందుకే జూన్​ లో  ఏదో ఒక రోజు జరపాలని జూన్ మూడో ఆదివారం గ్రామస్తులందరిని పిలిచి ..ఫాదర్స్ డే... నిర్వహించింది. తర్వాత తల్లుల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు.. తండ్రుల కోసం ఎందుకు కేటాయించరు?' అని పోరాటం మొదలుపెట్టింది సొనరా దాంతో 1910 జూన్ 19న ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్ డే వేడుకలు జరిపారు. అదే కాలక్రమంలో ప్రపంచమంతా పాకింది.