బురఖా ధరించి ఆటో నడుపుతోన్న మహిళా ఆటో డ్రైవర్

బురఖా ధరించి ఆటో నడుపుతోన్న మహిళా ఆటో డ్రైవర్

ఈ టెక్నాలజీ యుగంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము కూడా మగ వాళ్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అందులో భాగంగా నగరంలో రద్దీగా ఉండే వీధుల్లో బురఖా ధరించిన ఓ మహిళ ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ కనిపించింది. ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది వేరే ఏ దేశంలోనో, రాష్ట్రంలోనో కాదు. మన హైదరాబాద్ లో.

పురుషాధిక్య వృత్తిలో శిక్షణ పొందిన ఈ మహిళా ఆటోరిక్షా డ్రైవర్ పేరు ఆసియా బేగం. హైదరాబాద్‌లో నివసిస్తోన్న ఈమె.. ముఖానికి బుర్ఖా ధరించి ఎలక్ట్రిక్ ఆటోరిక్షాను నడుపుతోంది. అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ లో ఆసియా బేగం ఆటోను నడుపుతోన్న దృశ్యాలను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె ఆటో నడుపుతూ కనిపించింది. తనను రికార్డ్ చేస్తున్నారని తెలుసున్న ఆసియా.. వీడియో వైపు చూడడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

https://twitter.com/jsuryareddy/status/1667423501970718722