Funny Moments FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రౌండ్ లోపల ఆటగాళ్ల మధ్యే కాదు.. బయట కూడా మస్తు చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఫుట్‌బాల్ తో పాటు రోజుకో క్రేజీ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులకు ఎదురైన రెండు కిర్రాక్ సంఘటనలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఆ నవ్వు తెప్పించే వైరల్ సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లైవ్ లోనే ముద్దు:
సౌత్ కొరియాకు చెందిన ఒక టీవీ రిపోర్టర్.. వరల్డ్ కప్ ఫ్యాన్ జోన్ నుంచి అక్కడ ఉన్న జనాలు, ఫుట్‌బాల్ హడావుడి గురించి కెమెరా వైపు చూస్తూ లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ ఇస్తున్నాడు. ఆయన సీరియస్‌గా రిపోర్టింగ్ చేస్తున్న టైమ్‌లోనే.. వెనక నుంచి ఒక యువతి సడన్‌గా వచ్చి ఒక్కసారిగా రిపోర్టర్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, నవ్వుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తింది. ఈ ఘటనలో ఒక్కసారిగా అతడు షాక్ అయిపోయి.. ఏం చేయాలో తెలియక కొద్దిసేపు ఆగిపోయాడు. కానీ వెంటనే తేరుకుని, ఫేస్ మీద చిన్న నవ్వు నవ్వి, ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్లీ తన లైవ్ రిపోర్టింగ్‌ను కంటిన్యూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షకీరా కోసం మైక్ పక్కనబెట్టేసిన మరో జర్నలిస్ట్:
అర్జెంటీనాకు చెందిన ఫేమస్ జర్నలిస్ట్ మార్సెలో బెనెడెట్టో, మెక్సికో సిటీ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. సరిగ్గా అదే టైమ్‌లో గ్లోబల్ పాప్ సూపర్ స్టార్ షకీరా తన టీమ్‌తో కలిసి అక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూడగానే ఆ జర్నలిస్ట్‌కు పూనకం వచ్చినంత పనైంది. లైవ్ నడుస్తోందనే విషయం కూడా మర్చిపోయి.. చేతిలో ఉన్న మైక్‌ను అక్కడే కింద పడేసి, కెమెరాను వదిలేసి షకీరా వైపు పరిగెత్తాడు. ఆమెను రిక్వెస్ట్ చేసి ఒక కిర్రాక్ సెల్ఫీ దిగి, మళ్లీ వెనక్కి వచ్చి ఏమీ తెలియనట్టు మైక్ పట్టుకుని లైవ్ కంటిన్యూ చేశాడు. ఈ వీడియో చూసిన జనాలు.. "మనకు ప్రొఫెషన్ కంటే షకీరానే ముఖ్యం" అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ జర్నలిస్ట్‌కు ఇలాంటి పిచ్చి కొత్తేం కాదు.. 2018 చాంపియన్స్ లీగ్ ఫైనల్ టైమ్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ వదిలేసి పాప్ సింగర్ దువా లిపాతో ఇట్నే ఫోటో దిగి వైరల్ అయ్యాడు.
ఓపెనింగ్ సెర్మనీలో షకీరా రచ్చ:
ఈ సెల్ఫీ వివాదం జరిగిన మరుసటి రోజే.. వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీలో షకీరా స్టేజ్ మీద దుమ్ములేపింది. బర్నా బాయ్‌తో కలిసి ఆమె పాడిన "దై దై" (Dai Dai) సాంగ్‌కు స్టేడియం మొత్తం ఊగిపోయింది. ఆమెతో పాటు జె బాల్విన్, టైలా, మానా లాంటి గ్లోబల్ స్టార్స్ కూడా తమ పర్ఫార్మెన్స్‌లతో రచ్చ లేపారు.
This Korean journalist was covering the World Cup in Mexico, and a Mexican lady walked up and kissed him on live TV 😁 pic.twitter.com/Jq3VEhj3xA
— Dera II (@Neutral_OC) June 11, 2026
Todos pensaban que interrumpió la transmisión para hacerle una entrevista en vivo a Shakira, pero el solo quería una foto jajajaj pic.twitter.com/6rHL8GPsOQ
— VULGA (@vulgarcite) June 11, 2026
