ఫిఫా వరల్డ్ కప్ 2026లో నోరా ఫతేహి 'రెడ్ హాట్' పర్ఫార్మెన్స్.. దద్దరిల్లిపోయిన టొరంటో స్టేడియం!

ఫిఫా వరల్డ్ కప్ 2026లో నోరా ఫతేహి 'రెడ్ హాట్' పర్ఫార్మెన్స్.. దద్దరిల్లిపోయిన టొరంటో స్టేడియం!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం.. ఫుట్‌బాల్ ప్రేమికుల కలల పండుగ 'ఫిఫా వరల్డ్ కప్ 2026' అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గురువారం సాయంత్రం మెక్సికోలోని చారిత్రాత్మక ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో గ్లోబల్ పాప్ సెన్సేషన్ షకీరా తన సిగ్నేచర్ మూవ్స్, 'డై డై' (Dai Dai) అనే అఫీషియల్ యాంథమ్‌తో టోర్నమెంట్‌కు అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చింది. ఆమెతో పాటు నైజీరియన్ స్టార్ బర్నా బాయ్ స్టేజ్‌ను షేక్ చేశారు.

సొంత గడ్డపై నోరా స్టెప్పులు.. 

అయితే, అసలు సిసలైన ఊపు మాత్రం కెనడాలోని టొరంటో స్టేడియంలో జరిగిన రెండో ఓపెనింగ్ వేడుకల్లో కనిపించింది. అక్కడ బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, గ్లోబల్ ఐకాన్ నోరా ఫతేహి స్టేజ్‌పై వేసిన స్టెప్పులకు టొరంటో స్టేడియం దద్దరిల్లిపోయింది. కెనడా వర్సెస్ బోస్నియా మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ ఈవెంట్‌లో నోరా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 

కెనడియన్ ఫ్లాగ్‌ను తలపించేలా ఎరుపు, తెలుపు, బంగారు రంగులతో స్టేడియం ముస్తాబవగా.. నోరా ఫతేహి కిల్లింగ్ రెడ్ అవుట్‌ఫిట్‌లో డ్రామాటిక్ ఎంట్రీ ఇచ్చింది. కెనడాలోనే పుట్టి పెరిగిన నోరా, ఇప్పుడు అదే సొంత గడ్డపై ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై తన పర్ఫార్మ్ చేసి అలరించింది . ఫ్రెంచ్ సింగర్ వెజిడ్రీమ్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్‌లతో కలిసి ఆమె 'సీర్ సీర్' (Siir Siir) అనే అఫీషియల్ ఫిఫా సాంగ్‌కు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

 

భారతీయ సంస్కృతి ప్రదర్శన..

మొరాకో ఫుట్‌బాల్ స్టేడియం చాంట్ ఆధారంగా రూపొందిన ఈ పాటలో అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్‌లతో పాటు బలమైన భారతీయ సంస్కృతి, డ్యాన్స్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అని నోరా చెప్పుకొచ్చింది .  2022 ఖతార్ ఫిఫా కప్ క్లోజింగ్ సెర్మనీలో అదరగొట్టిన నోరా, ఇప్పుడు 2026 ఓపెనింగ్‌లోనూ మెరిసి ఇంటర్నేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. అలానిస్ మోరిసెట్, అలెసియా కారా, మైఖేల్ బుబ్లే వంటి గ్లోబల్ స్టార్స్ సైతం ఈ వేడుకల్లో భాగమయ్యారు.

ఇక  మూడో ఓపెనింగ్ వేడుక  శనివారం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ జరిగింది. దీనికి పాప్ సూపర్‌స్టార్ కేటీ పెర్రీ హెడ్‌లైనర్‌గా వచ్చింది.. తన పాత ఆల్బమ్‌లోని ‘వండర్’ (Wonder) అనే సాంగ్‌తో ఆమె ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ చేసింది. మొత్తానికి, ఫిఫా 2026 ఆట పరంగానే కాదు.. షకీరా, నోరా, కేటీ పెర్రీల గ్లామర్, ఎనర్జీతో వరల్డ్ వైడ్‌గా పూనకాలు తెప్పిస్తోంది.