MS Dhoni Birthday: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ 45వ పుట్టినరోజు (జూలై 7, 2026) సందర్భంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (FIFA) ఇచ్చిన ఒక క్రేజీ ట్రిబ్యూట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అయ్యే "తలా ఫర్ ఎ రీజన్" (Thala for a reason) అనే వైరల్ మీమ్‌ను వాడుకుంటూ ఫిఫా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ పోస్ట్‌లో ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ లియోనెల్ మెస్సి, కిలియన్ ఎంబప్పే, ఎర్లింగ్ హాలాండ్‌ల ఫొటోలను షేర్ చేస్తూ ధోనీకి బర్త్‌డే విషెస్ చెప్పింది ఫిఫా. ఫుట్‌బాల్‌కు, క్రికెట్‌కు ఫిఫా కుదిర్చిన ఈ క్రియేటివ్ కనెక్షన్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
నంబర్ 7 కనెక్షన్:
మహేంద్ర సింగ్ ధోనీకి, 7 నంబర్‌కు ఉన్న బంధం ప్రత్యేకమైనది. ఆయన పుట్టింది ఏడో నెల (జూలై) ఏడో తేదీన.. అంతేకాదు తన కెరీర్ అంతటా ధోనీ ధరించిన జెర్సీ నంబర్ కూడా 7.. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ ఏ 7 నంబర్ కనిపించినా, దానికి ఎలాంటి సంబంధం లేకపోయినా మన నెటిజన్లు "తలా ఫర్ ఎ రీజన్" అంటూ ధోనీ పేరును ట్రెండ్ చేయడం అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో గోల్డెన్ బూట్ (Golden Boot) రేసులో ఉన్న 3 టాప్ ప్లేయర్స్ లియోనెల్ మెస్సి, కిలియన్ ఎంబప్పే, ఎర్లింగ్ హాలాండ్‌లు ప్రస్తుతం చెరో 7 గోల్స్ చేసి సమంగా ఉన్నారు. ఈ ముగ్గురి గోల్స్ సంఖ్య '7' కావడంతో.. ఫిఫా కూడా ఇండియన్ ఫ్యాన్స్ స్టైల్‌లోనే ఆ 7 నంబర్‌ను ధోనీ బర్త్‌డేకు లింక్ చేస్తూ అదిరిపోయే పోస్ట్ పెట్టింది.
రేసులో ముందుకు దూసుకెళ్లే ఛాన్స్ ఎవరికి?
ఈ పోస్ట్ ధోనీ బర్త్‌డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా, ప్రస్తుత వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ రేసు ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో కూడా గుర్తు చేసింది. ఈరోజు (మంగళవారం, జూలై 7 IST) అట్లాంటా వేదికగా జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఈజిప్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సి కనుక మరిన్ని గోల్స్ చేస్తే, మిగిలిన ఇద్దరి కంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
గ్లోబల్ లెవెల్‌లో ధోనీ క్రేజ్:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్న సుదీర్ఘ అనుబంధం వల్ల తమిళంలో 'నాయకుడు' అని అర్థం వచ్చేలా అభిమానులు ధోనీని "తలా" అని పిలుచుకుంటారు. ఈ రోజు ఆ పేరు కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లో ఫిఫా వరల్డ్ కప్ వేదికగా మార్మోగిపోతుండటం చూసి క్రికెట్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
Fifa posted caption with"Happy thala day" on the Instagram 🥶
— Kartik Sharma (@KartikSharmaFC) July 7, 2026
Dream for someone fans with 275 million bot follower 😹😭 pic.twitter.com/XeSubRqzQu
