రొమాన్స్‌లు బంద్.. ఓన్లీ ఫైట్: లోకల్‌ ట్రైన్‌లో కొట్టుకున్న ప్రయాణికులు

రొమాన్స్‌లు బంద్.. ఓన్లీ ఫైట్: లోకల్‌ ట్రైన్‌లో కొట్టుకున్న ప్రయాణికులు

మొన్నటివరకూ లోకల్/ మెట్రో ట్రైన్లు అనగానే యువతీయువకుల అసభ్యకర దృశ్యాలు, రొమాన్స్ వీడియోలే దర్శనమిచ్చేవి. శరీరాన్ని సగం కప్పి ఉంచేలా బట్టలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించే వారు కొందరైతే, మరోచోట ప్లేస్ లేనట్లు ముద్దులాటలు మొదలెట్టేవారు మరొకొందరు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ద్రుష్టి పెట్టారని వారికి తెలిసిందో.. ఏమో ఇటీవల అలాంటివి కనిపించడం దాదాపు తగ్గిపోయాయి. 

ప్రయాణికులు కూడా ఇప్పుడు ట్రెండ్ మార్చారు. సినిమా స్టైల్‌లో తలపడటానికి సిద్ధపడుతున్నారు. ముంబై లోకల్  ట్రైన్‌లో ఇలాంటి సీన్లు సర్వసాధారణమట. ముంబై లోకల్‌ ట్రైన్లు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాలుతీసి కాలుపెడదామంటే చోటు ఉండదు. ఇసుకేస్తే రాలనంత జనం నిత్యం లోకల్‌ ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. ఈ రద్దీయే ఇద్దరూ ప్రయాణికులను కొట్టుకునేలా చేసింది. 

లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాసేపటికే ఆ మాటలు కాస్తా.. గొడవకు దారి తీశాయి. ఇంకేముంది ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో తోటి ప్రయాణికుడు కలుగజేసుకుని వారిని శాంతిపజేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.