బాలకృష్ణ సినిమాలో ఎనిమిది ఫైట్స్‌‌ నేచురల్‌‌గా ఉంటాయి : ఫైట్ మాస్టర్ వెంకట్‌‌

బాలకృష్ణ సినిమాలో ఎనిమిది ఫైట్స్‌‌ నేచురల్‌‌గా ఉంటాయి : ఫైట్ మాస్టర్ వెంకట్‌‌

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఫైట్ మాస్టర్ వెంకట్‌‌ దీనికి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలని కథ చెప్పినప్పుడే అనిల్ రావిపూడి అన్నారు. ఇందులో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉన్నాయి. దేనికదే కొత్తగా చూపించాలి. పైగా గతంలో బాలకృష్ణ గారు చేయని యాక్షన్స్ సీక్వెన్స్ అంటూ లేదు. మళ్ళీ వాటిని కొత్తగా ప్రజెంట్ చేయడం సవాల్‌‌తో కూడుకున్న విషయం. స్పెషల్ కేర్ తీసుకుని సరికొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది.

ఫస్ట్ హాఫ్ లో ఒకలా, సెకండ్ హాఫ్ లో మరోలా యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశా. ఆల్రెడీ బాలకృష్ణ గారితో పైసా వసూల్, వీరసింహారెడ్డి చిత్రాలకు వర్క్ చేశాను కనుక ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా హాలీవుడ్ స్టైల్ లో, చాలా నేచురల్‌‌గా యాక్షన్‌‌ సీన్స్‌‌ని డిజైన్ చేశా. బాలకృష్ట గారి కష్టం ఆ సీన్స్‌‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం నా సామిరంగా,  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గోపీచంద్ గారి సినిమాలకు వర్క్ చేస్తున్నాను’ అని చెప్పారు.