నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. కీలక కేసుల ఫైల్స్ దగ్ధం..

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. కీలక కేసుల ఫైల్స్ దగ్ధం..

హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ దగ్దమైనట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులోని వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో చాలా విలువైన హార్డ్ డిస్కులు డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు సికింద్రాబాద్ డీఎఫ్ఓ శ్రీదాస్. ఉదయం 10:30 గంటలకు తమకు సమాచారం అందిందని.. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామని అన్నారు.కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తుల ఉందని.. మొదటి అంతస్తులో సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని తెలిపారు.రెండవ అంతస్తులో ఉన్న కెమికల్ ల్యాబ్ కి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు డీఎఫ్ఓ శ్రీదాస్.

ఇవాళ ఉదయం బిల్డింగ్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బందికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు పోలీసులు.