కేసీఆర్‌ను పరామర్శించిన సినీనటుడు నరేష్

కేసీఆర్‌ను పరామర్శించిన సినీనటుడు నరేష్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను సినీనటుడు నరేష్ పరామర్శించారు.  కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. కేసీఆర్‌ కిందపడి ఇలా జరగటం బాధాకరమన్నారు.  ఆయన త్వరగా కోలుకోవాలని, ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.  కేసీఆర్ తాను చాలా సాన్నిహిత్యంగా ఉంటామని  చెప్పారు నరేష్.  

ఎర్రవల్లి తన నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు  వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు కేసీఆర్‌కుతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.  

రేపు అంటే డిసెంబర్ 15 శుక్రవారం రోజున  కేసీఆర్  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు.  ఆయన నేరుగా బంజారాహిల్స్‌ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లనున్నారు.