అనుకున్నవన్ని జరగవు కొన్ని మూవీ ఫస్ట్‌‌లుక్ పోస్టర్‌‌ రిలీజ్

అనుకున్నవన్ని జరగవు కొన్ని మూవీ ఫస్ట్‌‌లుక్ పోస్టర్‌‌ రిలీజ్

శ్రీరామ్‌‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’.  శ్రీ భరత్ ఆర్ట్స్‌‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ ఫస్ట్‌‌లుక్ పోస్టర్‌‌ను అల్లరి నరేష్‌‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పోస్టర్‌‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు సందీప్ నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్‌‌’ చిత్రానికి అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌గా పని చేశాడు. ఈ చిత్రంతో డైరెక్టర్‌‌‌‌గా పరిచయం కావడం ఆనందంగా ఉంది.

ఈ సినిమా సక్సెస్ సాధించి  టీమ్‌‌ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్‌‌ కామెడీ థ్రిల్లర్‌‌. ఈ జానర్ చిత్రాలు నరేష్‌‌గారు ఎన్నో చేశారు.  టైటిల్‌‌ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్‌‌ అనిపించింది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో పార్ట్ అవడం హ్యాపీ అంది మౌనిక. నవంబర్ 3న సినిమా రిలీజ్ చేయనున్నట్టు, కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు సందీప్ చెప్పాడు. పోసాని కృష్ణమురళీ, కిరిటీ, మిర్చి హేమంత్, చిక్ బబ్లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.