Filmfare Awards 2024: సత్తా చాటిన 12th ఫెయిల్ సినిమా

Filmfare Awards 2024: సత్తా చాటిన 12th ఫెయిల్ సినిమా

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ 2024’ (69th FilmFare Awards) జాబితా రిలీజయింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులు అందించారు. (జనవరి 28) ఆదివారం ఈ వేడుక ఘనంగా జరిగింది. 

ఈ జాబితాలో రీసెంట్గా రిలీజై ఘన విజయం సాధించిన 12th ఫెయిల్‌ (12th Fail ) ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎలాంటి అంచనాలూ లేకుండా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రశంసలు అందుకుంది. ఈ చిత్ర దర్శకుడు విధు వినోద్‌ చోప్రా బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును  సొంతం చేసుకున్నాడు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) విక్రాంత్‌ మెస్సె అవార్డును గెలుచుకున్నాడు.

రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor), అలియాభట్‌ (Alia Bhatt) జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు. ఈ  69వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ 2024' సందర్బంగా అవార్డులు అందుకున్న చిత్రాల జాబితాను చూసేయండి. ఈ వేడుకలో యానిమల్ మూవీ ఐదు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. అంచనాలు లేని  12th ఫెయిల్‌ మూవీ ఏకంగా ఐదు ఐదు క్యాటగిరీల్లో సత్తా చాటింది.

అవార్డుల జాబితా ఇదే..

  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
  • ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌ 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
  • ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • బెస్ట్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ (యానిమల్‌)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: అవినాశ్‌ అరుణ్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుభ్రతా చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (సామ్‌ బహదూర్‌)
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: జస్కున్వర్‌ సింగ్‌ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్‌)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌: సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్‌, నిధి గంభీర్‌ (సామ్‌ బహదూర్‌)
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: కునాల్‌ శర్మ (సామ్‌ బహదూర్‌), సింక్‌ సినిమా (యానిమల్‌)
  • బెస్ట్‌ కొరియోగ్రఫీ: గణేశ్‌ ఆచార్య (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • బెస్ట్‌ యాక్షన్‌: స్పిరో రజాటోస్, అనల్‌ అరసు (జవాన్‌)
  • బెస్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌: రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్‌ఎక్స్‌ (జవాన్‌)
  • బెస్ట్‌ నూతన దర్శకుడు: తరుణ్ దుడేజా (ధక్ ధక్‌)
  • బెస్ట్‌ డెబ్యూ మేల్‌: ఆదిత్య (ఫరాజ్)
  • బెస్ట్‌ డెబ్యూ ఫీమేల్: అలిజే అగ్నిహోత్రి (ఫారే)
  • లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: డేవిడ్‌ ధావన్‌
  • ఆర్‌.డి. బర్మన్‌ అవార్డ్‌ ఫర్‌ అప్‌ కమింగ్‌ మ్యూజిక్‌ టాలెంట్‌: శ్రేయ పురాణిక్ (యానిమల్)