సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో.. సింపుల్ గా ఇలా తెలుసుకోండి.. !

సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో.. సింపుల్ గా ఇలా తెలుసుకోండి.. !

గ్యాస్ అనగానే గుండె గుబేల్​ మంటుంది.. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్​ ముచ్చటే నడుస్తుంది. ఇంట్లో గ్యాస్​ మంట ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి.. ప్రస్తుతం గ్యాస్​ ను చాలా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.  ఎప్పుడు పడితే.. అప్పుడు కాఫీ కోసం... చిరుతిళ్ల కోసం గ్యాస్​ వెలిగించారా చుక్కలు చూడాల్సిందే.. ఇలాంటి పరిస్థితిలో మీరు వాడుతున్న సిలెండర్​ లో గ్యాస్​ ఎంత ఉందో సింపుల్​ గా ఎలా తెలుసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. . . !

 అమెరికా.. ఇజ్రాయిల్​.. ఇరాన్​ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్యాస్​ సక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయి.  ఇప్పటికే గ్యాస్​ బుక్​ చేసి15 రోజులైనా సిలిండర్​ ఇంటికి రాని పరిస్థితి.  ఇలాంటి సిట్యూవేషన్​ లో  ఇంట్లో వాడుతున్న సిలెండర్​ ఇంకాఎన్ని రోజులు వస్తుంది..ఎలా అంచనా వేయాలి. 

సిటీలో ప్రతి ఇంట్లో కచ్చితంగా గ్యాస్​ పొయ్యి  వాడాల్సిందే.. పల్లెల్లో అయితే విశాలమైన స్థలం.. ఇంటి ఎదుట ఖాళీ స్థలం ఉంటుంది.  కట్టెలపొయ్యి పెట్టుకొనే అవకాశాలున్నాయి.. ఇప్పుడు అక్కడ కూడా గ్యాస్​ పొయ్యే వాడుతున్నారనుకోండి..ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా.. భారతదేశంలో గ్యాస్​ సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయి.  మనం ప్రస్తుతం వాడుతున్న సిలెండర్​ను చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. 

గ్యాస్ ను ఐరన్​ సిలెండర్​ లో స్టోర్​ చేస్తారు.  అందువలన సిలెండర్​ లో  ఎంత గ్యాస్​ ఉందో తెలుసుకోవడం చాలాకష్టం.. సింగిల్​ సిలెండర్​.. గ్యాస్​ అయిపోయిందా.. వంట కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  అందుకే ముందుగా సిలెండర్​ లో ఎంత గ్యాస్​ ఉందో తెలుసుకోవాలి. 

సిలెండర్​లో గ్యాస్​ ఎంత ఉంది.. ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది.  అనే విషయాలను తడిగుడ్డతో చాలా సింపుల్​గా తెలుసుకోవచ్చంటున్నారు.  సాధారణంగా గ్యాస్ ఇంధనం (LPG) చాలా​ చల్లగా.. చాలా కూల్​గా ఉంటుంది.

  సిలెండర్ లో గ్యాస్​ ఎంతరకు ఉందో తెలుసుకోవాలంటే....

  • ముందుగా క్లాత్ ను అంతా నీళ్లలో బాగా తడపాలి.  తరువాత నీళ్లను గట్టిగా పిండాలి.
  • సిలెండర్​ను పైనుంచి కిందవరకు తడిగుడ్డతో తుడవాలి.
  • ఇప్పుడు సిలెండర్​ ను జాగ్రత్తగా పరిశీలిస్తే... గ్యాస్ లేకుండా ఖాళీగా ఉన్న సిలెండర్​ భాగంలో  త్వరగా  తడి ఆరిపోతుంది. గ్యాస్​ ఉన్న భాగం మాత్రం తడి ఆరడానికి సమయం పడుతుంది. 
  • ఇప్పుడు ఎక్కడవరకు అయితే త్వరగా ఆరిపోయిందో  అక్కడ చిన్న పాటి కలర్​  మార్క్​ను ఉంచుకోవాలి. 
  • మరల తరువాత రోజు కూడా అలానే చేయాలి.  అప్పుడు కూడా కలర్​ మార్క్​ పెట్టుకొంటే  మనము రోజుకు ఎంత గ్యాస్​ వాడుతున్నామో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. 
  • దీనిని బట్టి ఇంకా ఎన్ని రోజులు గ్యాస్​ సిలెండర్​ వస్తుందో తెలుసుకోవచ్చు కదా..! 

మరో పద్దతి..

గ్యాస్​ సిలెండర్​ పైనుంచి కింద వరకు తడిచేలా నీళ్లు పోయండి. పూర్తిగా తడిచిన తరువాత..చేతితో సిలెండర్​ ను టచ్​ చేయాలి.  గ్యాస్​ లేని భాగం కొద్దిగా వేడిగా.. గ్యాస్​ ఉన్న భాగం చేతికి చల్లగా ఉంటుంది. 

ఇంకో పద్దతి కూడా ఉంది.  కాని ఇది అందుబాటులో ఉండదు.  గ్యాస్​ సిలెండర్​ బరువు 15.3 నుంచి 15.5 కిలోలు ఉంటుంది.  కాని అందులో గ్యాస్​ మాత్రం 14.2 కిలోలు మాత్రమే ఉంటుంది.  

అంటే గ్యాస్ తో నిండి ఉన్న  సిలెండర్​బరువు29.7 కిలోలు ఉంటుంది.  ప్రస్తుతం మీ సిలిండర్​ 21 కిలోల బరువు ఉంటే అందులో నుంచి 15.5 కిలోలు మైనస్​ చేయాలి.  అంటే ఇంకా మీరు వాడుతున్న సిలెండర్​లో గ్యాలో 5.5 కిలోలు ఉందని పక్కాగా లెక్క.  మీరు ఈ సిలెండర్​ వాడటం మొదలు పెట్టి ఎంతకాలమైందో పరిశీలిస్తే ఇంకా ఎన్ని రోజులు వస్తుందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది.  అయితే గతంలో ఎన్నిగంటలు గ్యాస్​ను ఉపయోగించాము.. ఇప్పుడు ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నామో కూడా పరిగణనలోకి తీసుకోవాలి.