సీరం ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర : పూణేలోని  సీరం ఇన్ స్టిట్యూట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెర్మినల్-1 గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిరిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  భవనం రెండో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొవిషీల్డ్‌ టీకా సీరంలో తయారు అవుతున్న సంగతి తెలిసిందే.