జగిత్యాలలోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాలలోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్ వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్థుల్లో మంటలు వ్యాపించటంతో షాపులోని వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చేసరికి షాపింగ్ మాల్ పూర్తిగా కాలిపోయింది. నాలుగు అంతస్తుల్లో మంటలు వ్యాపించడంతో  రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలార్పారు. ఘటనలో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు