హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. ల్యాప్ టాప్ ప్యాకింగ్ ఆఫీసులో మంటలు

హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. ల్యాప్ టాప్ ప్యాకింగ్ ఆఫీసులో మంటలు

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండిపేటలోని యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు బిల్డింగ్ లోని నాల్గొవ అంతస్తులో ఉన్న లాప్ టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. భారీగా పొగలు చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చె ప్రయత్నం చేశారు.

బిల్డింగ్ నుండి భారీ ఎత్తున్న మంటల ఎగసిపడుతున్నాయి. అయితే మంటలు యూనియన్ బ్యాంక్ కు వ్యాపించకుండా నార్సింగీ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ఆఫీసులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొన్ని లాప్ టాప్ లు, డెస్క టాప్ లు దగ్ధమైయ్యాయి. షాట్ సర్యూట్ తో అగ్ని ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.