బాచుపల్లిలో అగ్నిప్రమాదం..5లక్షల ఆస్తి నష్టం

బాచుపల్లిలో అగ్నిప్రమాదం..5లక్షల ఆస్తి నష్టం

హైదరాబాద్ బాచుపల్లిలోని ఇందిరానగర్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో 5రేకుల రూములు పూర్తిగా కాలిపోయాయి. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూముల్లో ఉన్న వస్తువులు, బంగారం, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదంలో 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

వనపర్తి జిల్లాకు చెందిన పలు కుటుంబాలు 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇందిరానగర్లో గుడిసెలు, రేకుల రూములలో నివాసం ఉంటున్నారు. సాయంత్రం 7.30 సమయంలో ఓ గుడిసెలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగడంతో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు పక్కనున్న రూములకు వ్యాపించాయి. దీంతో 5 రేకుల రూములు పూర్తిగా దగ్దమయ్యాయి. రోడ్డునపడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.