ట్రాన్స్ఫార్మర్ పేలి టైర్ల షాపుకు మంటలు

ట్రాన్స్ఫార్మర్ పేలి టైర్ల షాపుకు మంటలు

హైదరాబాద్ మీర్ చౌక్ పీఎస్ పరిధిలోని దారుల్ షిఫా ప్రాంతంలోని ఓ టైర్ల షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాత టైర్ల దుకాణం పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. అయితే పక్కనే ఉన్న షాప్ కు మంటలు వ్యాపించడంతో టైర్లు మొత్తం కాలిపోయాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. వారం రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ నుండి ఆయిల్ లీక్ అవుతోందని ట్రాన్స్ కో అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని టైర్ల షాప్ యజమాని  తెలిపాడు.  అధికారుల నిర్లక్ష్యంగానే  అగ్నిప్రమాదం జరిగి తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు.